Breaking News

ప్రకాష్ రాజ్ కూతుళ్లు మన సినీ రంగానికి చెందిన వారే ..కావాలంటే మీరే చూడండి

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి పోటీ చేసి హీరో మంచు విష్ణు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ సంగతులు పక్కనబెడితే ఇటీవల ప్రకాశ్ రాజ్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను, కుటుంబ విశేషాలను పంచుకున్నాడు.

తనకు తెలుగు సాహిత్యం బాగా తెలుసని, తెలుగు భాషను తాను అనర్గళంగా మాట్లాడగలనని ప్రకాశ్ రాజ్ తెలిపాడు. తన అభిరుచికి తగ్గట్లు చిత్రాలను తెరకెక్కించానని, ప్రొడ్యూస్ కూడా చేశానని ప్రకాశ్ చెప్పుకొచ్చాడు. తనకు ముగ్గురు పిల్లలని, పెద్ద కూతురు పూజ షికగా యూనివర్సిటీ ఎంఏ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిందని, ప్రజెంట్ వెస్ట్రన్ ప్లస్ క్లాసికల్ సింగర్‌గా రాణిస్తోందని, తన రెండో కూతురు మేఘనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని, ఆమె ఏ.ఆర్.రెహమన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటుందని, వేదాంత్ చిన్నబ్బాయి అని వివరించాడు. ఈ క్రమంలోనే తన పెద్దబ్బాయి గురించి చెప్తూ బాధపడ్డాడు ప్రకాశ్. తనకు సిద్ధార్థ్ అనే అబ్బాయి ఉండేవాడని, వాడు పోయాడని, చెన్నయ్‌లోని ఇంట్లో గాలిపటం ఎగురేస్తూ పడిపోయాడని, ఆ క్రమంలోనే గాయాలయ్యాయని అన్నాడు. అలా అతడికి ఫిట్స్ కూడా వచ్చి ఒకరోజు సడెన్‌గా చనిపోయాడని బాధపడుతూ చెప్పాడు ప్రకాశ్ రాజ్. ఇక తన ఫస్ట్ వైఫ్ లతకు కొన్ని రీజన్స్ వల్ల డైవోర్స్ ఇచ్చినట్లు, ఆ తర్వాత కాలంలో ముంబైకి చెందిన పోనీవర్మ అనే కొరియోగ్రాఫర్‌ను మ్యారేజ్ చేసుకున్నట్లు చెప్పాడు. బాలచందర్ సినిమా షూటింగ్‌లో పోనీవర్మను మొదటి సారి చూసినట్లు చెప్పుకొచ్చాడు ప్రకాశ్ రాజ్. తాను తన అమ్మ, చెల్లి, పెద్దకూతురు, కుటుంబ సభ్యుల అనుమతితోనే రెండో పెళ్లి చేసుకున్నానని, పోనీ వర్మ సైతం ఆమె కుటుంబీకుల అంగీకరంతోనే తనను పెళ్లి చేసుకుందని వివరించాడు ప్రకాశ్. ఇక తన పిల్లలతో పోనీవర్మ ఫ్రెండ్‌గా ఉంటుందని, తన మాజీ భార్య లతతోనూ ప్రస్తుత భార్య పోనీవర్మ ఫ్రెండ్లీ‌గా ఉంటుందని వివరించాడు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *