Breaking News

పోసాని ప్రస్తావించిన పంజాబీ అమ్మాయి ఎవరు.. శ్రియానా? పూనం కౌరా? అసలు వాస్తవాలు

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ పెద్ద దుమారమే రేపాయి. ఈ ఈవెంట్‌లో పవన్ ఏపీ ప్రభుత్వంతో పాటు సినీ పరిశ్రమ పెద్దలపై పలు విమర్శలు చేయగా వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మద్దతుదారు అయిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. పవన్ సైకో అంటూ పవన్ సైకో ఫ్యాన్స్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు. ఇక రిప్లయిగా పవన్ ట్విట్టర్ వేదికగా మళ్లీ విమర్శలు చేశాడు. వైసీపీ గ్రామసింహాలకు భయపడేది లేదంటూ పేర్కొన్నాడు. ఈ సంగతులు ఇలా ఉంచితే.. పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూనే పంజాబీ యువతికి న్యాయం చేయాలంటూ కోరాడు. దీంతో పోసాని ప్రస్తావిస్తున్న పంజాబీ యువతి ఎవరు అనే విషయం ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారింది.

సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖుడు పంజాబీ యువతిని గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని, ముందుకు ఆమెకు న్యాయం చేయి పవన్ అంటూ పోసాని వ్యాఖ్యానించాడు. దాంతో పవన్ అభిమానులు, నెటిజన్లు ఇంతకీ ఈ పంజాబీ అమ్మాయి ఎవరు ? సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. ఆ పంజాబీ హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ శ్రియా సరణ్ అని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. అది చూసిన మరో నెటిజన్ శ్రియా కాదు పూనమ్ కౌర్ అని మరో పోస్టు పెట్టాడు. పూనమ్ గతంలో చేసిన ట్వీట్ ఫొటోను షేర్ చేశాడు. మొత్తంగా పవన్ కల్యాణ్, పోసాని కృష్ణ మురళి మధ్యలో పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చేసింది. పోసాని చెప్పిన పంజాబీ యువతి పూనమ్ కౌర్ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నిజానికి పూనమ్ కౌర్‌కు పంజాబీ మూలాలు ఉన్నప్పటికీ ఆమె హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుందని, ఆమె హైదరాబాదీ గర్ల్ అని మరికొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే పూనమ్ కౌర్ దాసరిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతున్నది. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి..

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *