Breaking News

పోసానికి ఎంతో మంది అమ్మాయిల‌తో సంబంధాలున్నాయి.. బాంబు పేల్చిన నిర్మాత‌

టాలీవుడ్‌లో ఇప్పుడు పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న రీతిలో సాగుతున్న వైరం గురించి తెలిసిందే. అటు ఇండ‌స్ట్రీ నుంచి రెండు ర‌కాలుగా మ‌ద్ద‌తు వ‌స్తోంది. కొంద‌రు పోసానికి స‌పోర్టు చేస్తున్న‌ట్టు మాట్లాడితే మ‌రికొంద‌రేమో ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తున్నారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాడో అప్ప‌టి నుంచే ఈ వైరం పీక్స్‌కు వెళ్లిపోయింది. ఇక జ‌గ‌న్ త‌ర‌ఫున పోసాని రంగంలోకి దిగి ప‌వ‌న్‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టిపోశాడు. ఇక దాంతో పోసానిపై జ‌న‌సైనికులు దాడులు చేయ‌డం మ‌రో లెవల్ కు వెళ్లిపోయింది.

ఇక పోసానిపై అటు మెగా కాంపౌండ్ నుంచి కూడా ఘాటుగానే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ అన్నయ్య నాగబాబుతో పాటు ఆయ‌న కుమార్తె నిహారిక కూడా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇలాంటి తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పవన్ కి కొంద‌రు మద్దత్తు ఇస్తూ పోసానిపై కౌంట‌ర్లు విసురుతున్నారు. ఇక ఇప్పుడు పోసానితో ప‌ని చేసిన నిర్మాత నల్లం శ్రీనివాస్ రంగంలోకి దిగారు. పోసినిపై సంచలన ఆరోపణలు చేయ‌డంతో క‌ల‌కలం రేపుతోంది. ఆయ‌న వీడియోలో మాట్లాడుతూ పోసాని ఇండ‌స్ట్రీకి కొత్తగా వ‌చ్చే నిర్మాతల‌ను నిండా ముంచాడ‌ని, ఎంతో మంది ద‌గ్గ‌రి నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశాడ‌ని చెప్పుకొచ్చారు.

ఇక అలాగే జెంటిల్మెన్ మూవీ సంద‌ర్భంగా పోసాని చాలామంది అమ్మాయిలతో రాసలీలలు సాగించాడ‌ని బాంబు పేల్చారు. త‌న ద‌గ్గ‌ర డబ్బులు ఎక్కువ తీసుకుని నాసిరకమైన మూవీ తీశాడ‌ని, పెద్ద మొత్తంలో డబ్బులు మిగిల్చుకున్నాడ‌ని చెప్పారు. అలాంటి పోసాని పవన్ కళ్యణ్ రెమ్యునరేషన్ మీద మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు. ద‌మ్ముంటే పోసాని త‌న‌తో డిబేట్‌కు వ‌స్తే ఆయ‌న మోసాల‌ను ఆధారాలతో సహా బయటపెడతానంటూ స‌వాల్ విసిరారు. దీంతో ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు రేగుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేయ‌డంతో అస‌లు ఏది నిజ‌మో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *