Breaking News

పెళ్లి రోజు సమంత కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా? విడాకుల తర్వాత చీర ఏం చేయబోతుంది ?

సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్నో చర్చల తర్వాత తామిద్దరం విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. మొత్తంగా ఎన్నో రోజులుగా నానుతూ వస్తున్న విడాకుల వ్యవహారం ఎట్టకేలకు పూర్తయ్యింది. అయితే వీరి వివాహం 2017లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇంతకీ వీరు ఎలా కలిశారు. పరిచయం ఎలా ఏర్పడింది? ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నాగ చైతన్య, సమంత తొలిసారిగా 2009లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ సందర్భంగా కలుసుకున్నారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా వీరిద్దరు నటించారు. అప్పుడే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సినిమా మంచి విజయం సాధించడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో కలిసి నటించారు. ఆర్వాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. పలు సందర్భాల్లో వీరిద్దరు కలిసి పార్టీలకు, టూర్లకు వెళ్లడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది. చివరకు తామిద్దరం ప్రేమలో ఉన్నామని నాగ చైతన్య, సమంతా ప్రకటించారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో 2017లో గోవాలో వీరిద్దని పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

అటు వీరి ఎంగేజ్మెంట్, వెడ్డింగ్ సందర్భంగా ధరించిన వస్త్రాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. నిశ్చితార్థం, పెళ్లి వేడుకలో సమంతా ధరించిన చీరల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నిశ్చితార్థం రోజున సమంతా కట్టుకున్న చీరను ప్రముఖ డిజైనర్‌ క్రేశా బజాజ్‌ తయారు చేశాడు. నాగ చైతన్యతో పరిచయం అయిన దగ్గర నుంచి నిశ్చితార్థం వరకు ఉన్న అనుభూతులను ఈ చీరపై బొమ్మల రూపంలో అద్దాడు. పెళ్లకి కూడా ప్రత్యేకంగా చీర, లెహంగాను డిజైన్ చేశాడు. పెళ్లిలో సమంతా ధరించిన చీర.. నాగ చైతన్య అమ్మమ్మ దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే రామానాయుడు భార్యది అన్నమాట. ఆ చీరను రీ మోడలింగ్ చేసి.. సమంతా ధరించింది. దీని కోసం సుమారు రూ. 40 లక్షలు ఖర్చు చేశారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *