Breaking News

పెళ్లికి ముందే ఎన్టీయార్‌కు తన భార్య ప్రణతి కండిషన్స్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

చాలా మంది ఇటీవల కాలంలో పెళ్లికి ముందే అనేక కండిషన్స్ పెడుతుంటారు. అందులో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఉంటారు. ఒకరికొకరు తమకు ఇలా ఉంటేనే నచ్చుతుందని, దానిని మీరి ప్రవర్తించరాదని ముందుగానే తమ భాగస్వాములతో చెప్పుకుంటున్నారు. ఇరువురు కండిషన్స్‌కు ఓకే అంటేనే ఆ బంధం పెళ్లి పీటల వరకు వెళ్తుంది. లేనియెడల మధ్యలోనే ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. అది లవ్ అయినా, అరేంజ్ మ్యారేజైనా కండిషన్స్ మాత్రం కామన్.

ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్, పెళ్లికి మధ్య చాలా గ్యాప్ వస్తోంది. దీంతో అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు తెలుసుకునేందుకు సమయం దొరుకుతోంది. ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకుని మనకు సెట్ అవుతారా? కాదా అని ఓ నిర్ణయానికి వస్తున్నాయి నేటి జంటలు. పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఏం కాదు. కానీ, పెళ్లి అయ్యాక అమ్మాయి, అబ్బాయి మాత్రం తమ భాగస్వాములు చెప్పిన వాటికి విలువ ఇవ్వాలి. అర్థం చేసుకోవాలి. లేనియెడల ఆ దంపతులు ఎక్కువకాలం సంతోషంగా ఉండలేరు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా తన భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టిందని టాక్.. ఆ కండిషన్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ మంచి రైజింగ్ టైంలో ఉన్నప్పుడే లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు మగ పిల్లలు కలరు. అయితే, ఎన్టీఆర్‌తో లక్ష్మీప్రణతి నిశ్చితార్థం తర్వాత పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టిందని తెలిసింది. వివాహం జరిగాక ఎన్టీఆర్‌ సినిమాలను వదిలి తన కోసం కనీసం రెండు నెలల టైం ఇవ్వాలని కోరిందట.. స్నేహితులతో కలిసి బయట తిరగడం తగ్గించాలని, ఇక తాను ఆహారం విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటానని చెప్పిందని తెలిసింది. షూటింగ్ కోసం అవుట్ డోర్‌కు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ డ్రెస్ విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటానని తెలిపిందట. మొత్తానికి తన కండిషన్స్ అన్నింటికీ ఎన్టీఆర్ ఓకే అన్నాకే పెళ్లికి సిద్ధపడిందట లక్ష్మీ ప్రణతి.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *