Breaking News

పెద్ద వ్యాపార‌స్తుడితో రెజీనా ల‌వ్ ఎఫైర్‌.. త్వ‌ర‌లోనే మ్యారేజ్‌..? మాములు కిలాడి కాదు కదా!

హీరోయిన్లు అంటేనే వారిమీద నిత్యం ఏదో ఒక రూమ‌ర్ వ‌స్తూనే ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా హీరోయిన్ల మీద అయితే బోలెడ‌న్ని వార్త‌లు చెక్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. ఇందులో పెండ్లి కాని వారి మీద ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఇప్పుడు హీరోయిన్ రెజీనా విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వైర‌ల్ గా మారింది. రెజీనా కసాండ్రా అంటే తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. తన అందంతో యూత్ గుండెలు కొల్ల‌గొట్టింది. ఇటు తెలుగులో సినిమాలు చేస్తూనే అటు తమిళ, కన్నడ హీరోల‌తో కూడా అవ‌కాశాలు ద‌క్కించుకుంది.

అయితే ఈ భామ సినిమాల‌తో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఇలా నిత్యం త‌న ఫ్యాన్స్తో చిట్ చాట్ చేస్తోంది. రెజీనా. టాలీవుడ్‌కు శివ మ‌న‌సులో శృతి మూవీతో తెరంగేట్రం చేసిన రెజీనా ఆ త‌ర్వాత లవ్ స్టోరీ, కొత్తజంట లాంటి మూవీల‌తో అల‌రించింది. అయితే నిత్యం రొటీన్ ల‌వ్ స్టోరీ మూవీల్లో న‌టించింది. వాటితో ఆమెకు బ్రేక్ రాక‌పోవ‌డంతో క్ర‌మ‌క్ర‌మంగా సిఇన‌మా అవకాశాలు కూడా తగ్గిపోవడం ప‌రిపాటిగా మారింది. దీంతో అటు వెబ్ సిరీస్ లపై ఫోక‌స్ పెట్టింది ఈ హాట్ బ్యూటీ.

ఇదిలా ఉండ‌గా రీసెంట్‌గా త‌న గురించి తన లవ్ సీక్రెట్ గురించి సంచ‌ల‌న విషయాలు తెలిపింది రెజీనా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రెజీనా అనేక విష‌యాల‌ను పంచుకుంది. అదేంటంటే తాను కెరీర్ స్టార్టింగ్‌లో ఓ వ్య‌క్తితో ప్రేమలో పడ్డాన‌ని ఆ స‌మ‌యంలో అనుకోకుండా కొన్ని పొర‌పాట్లు కూడా చేసిన‌ట్టు వివ‌రించింది. ప్రేమ అనే మ‌త్తు నుంచి బయటకు వచ్చాకే అలాంటి వాటికి దూరంగా ఉంటున్నాన‌ని వివ‌రించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ మ‌రో బిజినెస్ మ్యాన్ తో ల‌వ్‌లో ఉంద‌ని త్వ‌ర‌లోనే వీరి వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని వార్తలు వినిపిస్తున్నాయ్. మరీ ఈ రూమ‌ర్లు నిజ‌మో కాదో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *