Breaking News

పూరీ అతడి భార్య నుంచి విడిపోయాడా ? అసలు నిజాలు బయటపెట్టిన ఫ్యామిలీ ఫ్రెండ్

అంబర్ పేట శంకర్.. అలియాస్ శంకరన్న. మంచి వాళ్లకు మంచి వాడు.. చెడ్డ వాళ్లకు చెడ్డవాడు అనే పేరుంది. ఒకప్పుడు పహిల్వాన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు సినిమా పరిశ్రమకు చెందిన పలువురితో దగ్గరి సంబంధాలున్నాయి. అందులో భాగంగానే దర్శకుడు పూరీకి సంబంధించిన పలు విషయాలను ఆయన తాజాగా వివరించాడు. ఇంతకీ ఆయన చెప్పిన పూరీ ఫ్యామిలీ ముచ్చట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు. విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ అనే పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. అయితే పూరీ జగన్నాథ్ వివాహం, ఆయన భార్య, తన పిల్లల గురించి అంబర్ పేట శంకర్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. పూరీ జగన్నాథ్ కు పెళ్లి చేసింది తానేనని చెప్పాడు. రామంతపూర్ కు చెందిన లావణ్యను చూసి పూరీ జగన్నాథ్ ఇష్టపడ్డాడని.. ఆ అమ్మాయి తమకు దగ్గర మనిషి అని చెప్పింది. ఈ విషయం పూరి తనకు చెప్పడంతో వారి పెళ్లి చేసినట్లు చెప్పాడు. అటు పూరీ జగన్నాథ్, ఆయన భార్య లావణ్య విడిపోయారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పాడు. అందులో ఏమాత్రం నిజం లేదన్నాడు. వారింతా కలిసే ఉంటున్నట్లు చెప్పాడు. ఇప్పటికీ పూరీ తనతో టచ్ లో ఉంటాడని చెప్పాడు. తన కొడుకు ఆకాశ్ కూడా బర్త్ డే సమయంలో తమ ఇంటికి వస్తాడని చెప్పాడు.

అటు ఆరోజుల్లోనే తనపై పాటలు వచ్చాయని చెప్పాడు. తొలిసారి ప్రస్తుత గేయ రచయిత చంద్రబోస్ తన మీద మంచి పాట రాసినట్లు చెప్పాడు. అప్పట్లో ఆయన రాసిన పాట బాగా ఫేమస్ అయ్యిందని చెప్పాడు. ఇప్పటికీ చంద్రబోస్ తనంటే ఎంతో ఇష్టపడతాడని చెప్పాడు. తన వాళ్లకు ఎవరికైనా పాటలు కావాలంటే నేను చెప్పి రాయిస్తానన్నాడు శంకర్. ఆయన ఒకప్పుడు రాసిన పాటను మార్చి ఇప్పుడు మధుప్రియ శీలంసాయి కట్ట కింద అనే పాట పాడిందని చెప్పాడు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *