Breaking News

పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద సూర్య ఏం చేసాడో చూడండి ..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం పట్ల భారత సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పునీత్ చనిపోయి వారం రోజులు కావస్తున్నా ఇంకా విషాద చాయలు అలుముకుని ఉన్నాయి. పునీత్ లోని లేటుని ఎవరూ భర్తీ చేయలేరని సినీ ప్రముఖులు చెప్తున్నారు.

ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు అనివార్య కారణాల వల్ల హాజరు కాని సినీ ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఇటీవల కలుస్తున్నారు. వారికి ధైర్యం చెప్పి ఓదార్చి, పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. నటనతోనే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలిచిన పునీత్ రాజ్ కుమార్ లేని లోటుని చిత్ర పరిశ్రమలో ఎవరు కూడా భర్తీ చేయలేరని సినీ ప్రముఖులు అంటున్నారు. ఇటీవల టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చాడు. తాజాగా కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించాడు. శివరాజ్ కుమార్‌తో కలిసి పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని సూర్య ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే సూర్య కన్నీటిపర్యంతమయ్యారు. పునీత్ సమాధి వద్ద సూర్య రోదిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. పునీత్ రాజ్ కుమార్‌కు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులతో సత్సంబంధాలున్నాయి. శాండల్ వుడ్ హీరో అయినప్పటికీ పునీత్.. అన్ని ఇండస్ట్రీల హీరోలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇకపోతే అనాథాశ్రమాలు, స్కూల్స్‌తో పాటు ఇతర కార్యక్రమాలకు పునీత్ రాజ్ కుమార్ చాలానే చారిటీ చేశాడు. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల కన్నడ ప్రజలు, పునీత్ అభిమానులు విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పునీత్ రాజ్ కుమార్ చిత్రపటానికి నివాళి అర్పించారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *