Breaking News

పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహం చూసి కన్నీటి పర్యంతమైన బాలకృష్ణ

కన్నడ కంఠీరవ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ రాజ్ కుమార్ తనయుల్లో ఒకరైన పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంతో సినీ లోకం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అభిమానులు, ప్రజల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచారు.

ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని చూసేందుకుగాను అభిమానులు, కన్నడ ప్రజలు, సెలబ్రిటీలు తరలివస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహం చూసి నివాళి అర్పించేందుకు వెళ్లారు. నందమూరి నటసింహం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహానికి పూలమాలలు నివాళులర్పించారు. బాలకృష్ణ పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం శివరాజ్ కుమార్‌ను ఓదార్చారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం తన స్నేహతుడైన పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహం చూసి భావోద్వేగానికి గురయ్యాడు.

ఇకపోతే పునీత్ రాజ్ కుమార్‌కు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్‌తో సత్సంబంధాలున్నాయి. పునీత్ రాజ్ కుమార్ హీరోగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అప్పు’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. పునీత్‌కు మెగా ఫ్యామిలీతో పాటు నందమూరి హీరోలు, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇతర హీరోలతో మంచి సంబంధాలున్నాయి. పునీత్ రాజ్ కుమార్ నటించిన ఓ చిత్రంలో ‘గెలయా గెలయా’ సాంగ్‌ను జూనియర్ ఎన్టీఆర్ పాడిన సంగతి తెలిసిందే. ఇకపోతే తెలుగు సినిమాలు కొన్నిటినీ ప్యారలల్‌గా పునీత్ రాజ్ కుమార్ రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. మహేశ్ బాబు ‘దూకుడు’ సినిమాను పునీత్ రాజ్ కుమార్ కన్నడలో రీమేక్ చేశాడు. పునీత్ రాజ్ కమార్ మృతి పట్ల సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. పదేళ్ల వయసులోనే అప్పటి రాష్ట్రపతి జియాని జైల్ సింగ్ చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న పునీత్ రాజ్ కుమార్… ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ సింపుల్ లైఫ్ లీడ్ చేశాడు. ఆయన సినీ జర్నీ ప్రతీ ఒక్కరికి ఇన్‌స్పిరేషన్.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *