Breaking News

పునీత్ రాజ్ కుమార్ ఆస్తుల విలువ.. అన్ని కోట్లా..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త తెలుసుకుని సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కన్నడ ప్రజలు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పునీత్ మరణానికి ముందర చేసిన జిమ్ వర్కవుట్స్ వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

కన్నడ ఇండస్ట్రీలో అందరు ముద్దుగా ‘అప్పు’ అని పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ చేసిన చారిటీ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే పునీత్ లేని లోటును ఎవరూ పూడ్చలేరని ప్రతీ ఒక్కరు విచారం వ్యక్తం చేస్తున్నారు. 45 స్కూల్స్, 25 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలతో పాటు 1,800 మంది స్టూడెంట్స్‌ను దత్తత తీసుకున్న పునీత్ రాజ్ కుమార్ రియల్ హీరో అని, ఆయన ప్రతీ ఒక్కరికి ఇన్‌స్పిరేషన్ అని అంటున్నారు. కన్నడ కంఠీరవ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉండే పునీత్ రాజ్ కుమార్ సింప్లిసిటీకి కేరాఫ్‌లా ఉంటారని అనుకుంటున్నారు. పదేళ్ల వయసులోనే అప్పటి రాష్ట్రపతి జియాని జైల్ సింగ్ నుంచి జాతీయ అవార్డు అందుకున్న పునీత్ రాజ్ కుమార్..సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఎప్పుడూ అందరితో చాలా బాగా ఉండేవారని అభిమానులు చర్చించుకుంటున్నారు. పునీత్ ఆస్తుల విలు సుమారు రూ.350 నుంచి రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పునీత్ ఒక్క సినిమాకు రూ.8 నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని కన్నడ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. పునీత్ రాజ్ కుమార్ కమర్షియల్ యాడ్స్‌లో నటించినందుకుగాను ఒక్కోయాడ్‌‌కు కోటి రూపాయలకుపైనే రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఇకపోతే టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అప్పు’ సినిమాతో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ఇంట్రడ్యూస్ కావడం విశేషం. ఈ సినిమా రవితేజ ‘ఇడియట్’ సినిమాకు కన్నడ రీమేక్. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఆంధ్రావాలా’ సినిమా అంతగా ఆడలేకపోగా, ఇదే సినిమా కన్నడలో ‘వీర కన్నడీగ’ పేరుతో తీయగా, అక్కడ అది సూపర్ హిట్ కావడం గమనార్హం.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *