Breaking News

పునీత్ మరణానికి నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ రోజు అందుకే అలా చేశాను : Dr. రమణ రావు

ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో మనందరినీ విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయాడు. అసలు పునీత్ రాజ్ కుమార్ చనిపోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పునీత్ కు వైద్యం చేసిన డాక్టర్ రమణారావు నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరంలోని సదాశివనగరలో గల డాక్టర్ ఇల్లు, మరియు క్లీనిక్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు వైద్యం చేసిన డాక్టర్‌ రమణరావు నిర్లక్ష్యం వల్లే పునీత్ మరణించాడని కొద్ది మంది పునీత్ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. డాక్టర్ ను అరెస్టు చేయాలని కూడా డిమాండ్లు చేస్తున్నారు. ఆయన ఇంటి ముందు ధర్నా చేసేందుకు సిద్ధం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పరిచారు.

కానీ పునీత్ కు వైద్యం చేసిన డాక్టర్ విజయరమణారావు మాత్రం వైద్యంలో ఎటువంటి పొరపాటు జరగలేదని చెబుతున్నారు. తాను పునీత్ రాజ్ కుమార్ కు కరెక్ట్ గానే చికిత్సలు చేశానని చెబుతున్నారు. తన చికిత్సలో ఎటువంటి లోపం లేదని వివరించారు. పునీత్ 29 వ తేదీ ఉదయం 11.15 నిముషాలకు మా క్లీనిక్ కు వచ్చారు. ఆయనకు అప్పటికే తీవ్రంగా చెమటలు పట్టి ఉన్నాయని డాక్టర్ వివరించారు. అందుకోసమే ఈసీజీ తీశామని పేర్కొన్నారు. కానీ బ్యాడ్ లక్ కొద్ది పునీత్ ను దక్కించుకోలేకపోయామని బాధపడ్డారు. పునీత్ ను వెంటనే విక్రమ్ ఆస్పత్రికి తరలించామని స్పష్టం చేశారు. అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తే సమయం మించిపోతుందని పునీత్ ను కారులోనే నాలుగైదు నిమిషాల్లోపు ఆస్పత్రికి పంపించామని పేర్కొన్నారు. కానీ ఆస్పత్రిలో కూడా పునీత్ కు చికిత్సలు చేసినా కానీ అతడిని కాపాడలేకపోయారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *