Breaking News

పునీత్ ఫ్యామిలీకే ఎందుకిలా..? అప్పుడు అన్న… ఇప్పుడు తమ్ముడు…

నటుడు పునీత్ రాజ్‌కుమార్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన విషయం తెలిసిందే.. అయితే ఆ రోజు మార్నింగ్ రాజ్‌కుమార్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే క్రిటికల్‌గా మారడంతో ఆయన కన్నుమూశారు. చైన్నైలో పుట్టిన పునీత్.. ఆరేండ్ల వయసున్నప్పుడు ఆయన ఫ్యామిలీ మొత్తం మైసూర్‌కు వెళ్లిపోయింది.

పునీత్ తండ్రి సైతం కన్నడ‌లో టాప్ హీరో.. తన ఫ్యామిలీలో అందరికంటే చిన్ని వాడు పునీత్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. సుమారు 20 మూవీస్‌లో నటించారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సైతం గెలుచుకున్నారు. తెలుగులో రవితేజ, రక్షిత హీరో హీరోయిన్‌గా పూరిజగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఇడియట్ మూవీని… అప్పు పేరుతో రిమేక్ చేసిన మూవీలో పునీత్ నటించాడు. దీంతో అతనికి చాలా క్రేజ్ వచ్చింది. తర్వాత ఆయన ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో యాక్ట్ చేశారు.

పునీత్ రాజ్‌కుమార్ గొప్ప యాక్టరే కాకుండా మంచి డ్యాన్సర్, సింగర్ సైతం. తాను యాక్ట్ చేసిన మూవీస్‌లో తానే ఎన్నో పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన ఆకస్మిక మృతి చెందాడనే న్యూస్ బయటకు రావడంతో కర్ణాటక విషాదంలో మునిగిపోయింది. ఆయన యాక్టింగ్ లోనే కాదు.. సోషల్ సర్వీస్ లోనూ ముందుంటాడు. ఎన్నో స్కూళ్లను, అనాథాశ్రమాలను, గోశాలలను నిర్వహిస్తున్నాడు. సుమారు పద్దెనిమిది వందల మంది స్టూడెంట్స్‌కు ఫ్రీగా చదువును చెప్పిస్తున్నాడు. తన రెండు కళ్లను సైతం ఆయన దానం చేశాడు. ఇలాంటి గొప్పవ్యక్తిని కోల్పోయినందుకు కన్నడకు చెందిన ప్రజలంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. గతంలో పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య.. శివ రాజ్‌కుమార్ సైతం హార్ట్ ఎటాక్ కు గురయ్యారు. ప్రస్తుతం పునీత్ రాజ్‌కుమార్‌కు సైతం అలాంటి పరిస్థితే వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందని అతని ఫ్యాన్స్‌తో పాటు కర్ణాటక ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. మంచి మనిషిని కోల్పోయామని బాధపడుతున్నారు. ఆయన చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను సైతం గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు నటులు సైతం వాపోతున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *