Breaking News

పునీత్ కు వైద్యం చేసిన డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలేంటంటే.. ఆయనకు ఇంతవరకూ..

పునీత్ రాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్. ఎన్నో సినిమాల్లో కన్నడీయులను తన నటనతో ఇంప్రెస్ చేసిన పునీత్ అకస్మాత్తుగా ఈ లోకం విడిచి పెట్టి వెళ్లిపోయాడు. చాలా చిన్న ఏజ్ (46) లోనే అతడు మనల్ని విడిచిపోవడం చాలా బాధాకరం. పునీత్ మరణ వార్త విన్న అనేక మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు వివిధ రూపాల్లో తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ సింప్లిసిటీకి పెట్టింది పేరని అనేక మంది గుర్తు చేసుకుంటున్నారు. ఎలాంటి వారు బీధలైనా, ధనికులైనా సరే ఆహ్వానిస్తే పునీత్ ఫ్యామిలీ తప్పకుండా వెళ్లేదని తెలుపుతున్నారు. అటువంటి పునీత్ ను కోల్పోవడం సినీ పరిశ్రమతో పాటు మానవత్వానికి కూడా తీరని లోటని తెలియబరుస్తున్నారు.

ఇంత చిన్న ఏజ్ లో పునీత్ కు గుండె నొప్పి వచ్చిందంటే ఎవరూ నమ్మడం లేదు. చాలా ఫిట్ గా ఉండే పునీత్ కు గుండె నొప్పి రావడమేంటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ లో కన్ను మూశారు. పునీత్ కు వైద్యం అందించిన డాక్టర్ రంగనాథన్ పునీత్ గురించి చాలా ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. డాక్టర్ రంగనాథన్ చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్. డెయిలీ లాగే పునీత్ రాజ్ కుమార్ చనిపోయే రోజు కూడా వర్కవుట్ చేయడం కోసమని జిమ్ కు వెళ్లారు. అక్కడ తనకు గుండెలో నొప్పిగా అనిపించడంతో పునీత్ రాజ్ కుమార్ వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్ ను కన్సల్ట్ అయ్యాడట. పునీత్ అక్కడ వెళ్లిన వెంటనే ఆయన ఫ్యామిలీ డాక్టర్ అయిన రమణ పునీత్ రాజ్ కుమార్ కు ECG టెస్టును చేయగా.. పునీత్ నొప్పి గుండెనొప్పిగా తేలింది.

పునీత్ ను విక్రమ్ హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత దాదాపు మూడు గంటల పాటు వెంటిలేటర్ పై ఉంచినట్లు డాక్టర్ రంగనాథన్ తెలిపారు. ఈ సమయంలో ఆయన గుండెకు మసాజ్ చేసి, ఆయనను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించినట్లు వివరించారు. అయినా కానీ పునీత్ ను బతికించుకోలేకపోయినట్లు రంగనాథన్ బాధ పడ్డారు.
ఇంతకు ముందెప్పుడూ పునీత్ కు గుండె నొప్పి రాలేదని రంగనాథన్ తెలిపారు

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *