Breaking News

పునీత్ అకాలమరణం వేళ.. వీరప్పన్ చేతిలో రాజ్‌కుమార్ కిడ్నాప్ ఉదంతం గుర్తు చేసుకున్న అభిమానులు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణవార్త తెలుసుకుని సినీ లోకం దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. కాగా, పునీత్ పార్థివ దేహాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ప్రజలు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చి పునీత్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఈ విషాద సమయంలో పునీత్ రాజ్ కుమార్ తండ్రి కన్నడ కంఠీరవ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు అభిమానులు.

అప్పట్లో స్మగ్లర్ వీరప్పన్ డాక్టర్ రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్‌కు గల కారణాలు వెల్లడించకుండా 2000 సంవత్సరంలో జూలై30 వ తేదీన రాత్రి 9.30 గంటలకు డాక్టర్ రాజ్ కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలో రాజ్ కుమార్ తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాలోని గాజనూరు గ్రామంలోని తన ఇంటిలో ఉన్నారు. రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేసిన సమయంలో ఆనాడు తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేయబోతున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా కరుణానిధి ప్రభుత్వంపై విమర్శలు రాగా, ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ప్రముఖ నటుడికి సెక్యురిటీ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంఠీరవ రాజ్ కుమార్‌ను వీరప్పన్ దాదాపు మూడు నెలలు అడవిలోనే బంధించాడు. రాజ్ కుమార్‌ను విడిపించాలని కరుణానిధి ప్రభుత్వంపై ఒత్తిళ్లు రాగా, వీరప్పన్‌తో తమిళనాడు ప్రభుత్వం చర్చలు జరిపింది. తనపై ఉన్న 135 కేసులు ఎత్తివేస్తే రాజ్ కుమార్‌ను విడుదల చేస్తానని పేర్కొన్నాడు వీరప్పన్. అయితే, తన డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోక మునుపే 2000 నవంబర్ 15న రాజ్ కుమార్‌ను వదిలేశాడు. ఆ ఉదంతాన్ని కన్నడ ప్రజానీకం గుర్తు చేసుకుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *