Breaking News

పాపం ఉదయభాను .. మొదటి భర్తతో ఇంత వేదన అనుభవించిందా ?

ప్రజల కోసమే చిత్రాలు నిర్మించే నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి చిత్రం ‘ఎర్రసైన్యం’తో వెండితెరకు బాలనటిగా పరిచయమైంది ఉదయభాను. ఇక ఆ తర్వాత కాలంలో యాంకర్‌గా బుల్లితెరపై ప్రత్యక్షమై ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకుంది. జీతెలుగు, స్టార్ మా, ఈ టీవీ, జెమిని ఇలా చానల్స్ అన్నిటిలోనూ తనదైన మాటలతో ప్రేక్షకుల హృదయాలు దోచేసుకున్న తెలంగాణ బిడ్డ ఉదయభాను గత కొంత కాలంగా తెరపై కనబడటం లేదు.

యాంకరింగ్‌తో పాటు చిత్రాల్లోనూ నటించింది ఉదయభాను. పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో కనిపించిన ఉదయ భాను ‘మధురిమ’ అనే చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేసింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా’ సాంగ్‌లో ఉదయ భాను పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సంగతులు పక్కనబెడితే.. ఉదయ భాను గురించి మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చినప్పటికీ ఆమె ఎప్పుడూ స్పందించ లేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగింది. ఆమె వైవాహిక జీవితానికి సంబంధించి కూడా చాలా వార్తలు నెట్టింట అప్పట్లో హల్ చల్ చేశాయి. అయితే, ఉదయ భానుకు చిన్నప్పుడే పెళ్లి చేయగా, తనకంటే ఏజ్‌లో చాలా పెద్దవాడైన ఆ వ్యక్తికి ఉదయభాను విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ కుమార్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న ఉదయభాను ఇంటికే పరిమితమైంది. ఆమెకు కవల పిల్లలు సంతానం. కాగా, వారిని చూసుకుంటూ హ్యాపీగా ఇంటి వద్దే టైం స్పెండ్ చేస్తోంది ఉదయభాను. అప్పట్లో ఉదయభాను, కమెడియన్ వేణుమాధవ్‌తో కలిసి చేసిన ‘డ్యాన్స్ బేబి డ్యాన్స్’ ప్రోగ్రాం అప్పట్లో బాగా పాపులర్ అయింది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌లో ఉదయభాను యాంకర్‌గా ఉన్న సమయంలోనే ఆ షోకు గెస్టులుగా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ప్రభుదేవా వచ్చారు. ఇకపోతే ‘రేలా రే రేలా’ప్రోగ్రాంలో ఉదయ భాను యాంకర్‌గా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేవారు. గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ్ వంటి వారు తెలంగాణ పాటలకు అర్థం చెప్తున్న క్రమంలో వారితో అప్యాయంగా ముచ్చటించేది ఉదయభాను.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *