Breaking News

పవన్ నుంచి చై వరకు అభిమానులను కంట తడి పెట్టించిన సెలెబ్రిటీల విడాకులు ఇవే

సినిమా తారల పట్ల జనాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. వారు తమకు ఏమీ చేయరని తెలుసు.. కానీ వారిని ఆరాధించకుండా ఉండలేరు. అందుకే పొలిటీషియన్స్, స్పోర్ట్స్ పర్సన్స్ తో పోల్చితే సినిమా తారలకే మాస్ జనాదరణ ఉంటుంది. ఆయా తారలు తమ అభిమాన తారలని అఫీయల్ గా ప్రకటించుకుంటారు సాధారణ జనాలు. అయితే సెలబ్రిటీలు చేసే కొన్ని పనులు అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తాయి. అలాంటి వాటిలో రెండు సెలబ్రిటీ జంటల విడాకులున్నాయి. ఎంతో చక్కటి జంటలుగా గుర్తింపు పొంది.. అనుకోకుండా విడిపోవడంతో అభిమానులు కంటతడి కూడా పెట్టుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో రెండు విడాకులు ఘటనలు ఫ్యాన్స్ కు తీవ్ర ఆవేదనను కలిగించాయి. అందులో ఒకటి రేణు దేశాయ్- పవన్ కల్యాణ్ విడాకుల వ్యవహారం. రెండోది సమంతా- నాగచైతన్య డివోర్స్ ఘటన.

*రేణు దేశాయ్- పవన్ కల్యాణ్ విడాకులు
బద్రి సినిమాతో పవన్ కల్యాణ్ తో జోడీ కట్టి తెలుగు జనాలకు పరిచయం అయ్యింది రేణు దేశాయ్. ఈ సినిమాతోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఏడాది తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే పవన్ కు ఇది రెండో పెళ్లి. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అకీరా నందన్, ఆధ్యా కాత్యాయిని. 11 సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన ఈ జంట అనంతరం విడిపోయారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ అన్నా లెజ్నెవా అనే ఆమె పెళ్లి చేసుకున్నాడు. అయితే రేణు-పవన్ విడాకుల వార్త ఆయన అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. ఇప్పటికే రేణు- పవన్ జంటనే గొప్పగా చూస్తారు అభిమానులు. ఇప్పటికీ పవన్ భార్యను కేవల్ రేణు దేశాయ్ నే ఊహించుకుంటారు. వీరు విడిపోయినప్పుడు ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు.

*సమంతా- నాగచైతన్య డివోర్స్
తాజాగా టాలీవుడ్ క్యూట్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంతా విడాకులు వ్యవహారం కూడా అక్కినేని అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. తెలుగులో ఏమాయ చేసావే అనే సినిమాతో నాగ చైతన్య, సమంతా వెండి తెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే జనాలను అద్భుతంగా ఆకట్టుకున్నారు. అటు ఈ సినిమా చేస్తున్న సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా కాలం పాలు వీరి ప్రేమ వ్యవహారం నడిచింది. చివరకు 2017లో వీరిద్దరు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరిద్దరు విడిపోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ ప్రకటన సమంతా, నాగచైతన్యతో పాటు అక్కినేని అభిమానులకు షాక్ కలిగించింది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *