Breaking News

పవన్ కల్యాణ్ పిల్లలపై రచ్చరచ్చ.. వారికి వారికి ఆ చదువులు వద్దు అంటూ ట్రోలింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల పాటు సినీ ‘అజ్ఞాతవాసం’ చేసినప్పటికీ తర్వాత ‘వకీల్ సాబ్’గా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చేశాడు. వరుస సినిమాలకు కమిట్ అయిన జనసేనాని ప్రజెంట్.. సినిమాలు, పాలిటిక్స్ రెండూ చేస్తున్నాడు. జోడు గుర్రాల స్వారీ మాదిరగా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయ పార్టీకి సంబంధించిన సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నాడు.

ఇకపోతే పవన్ కల్యాణ్ క్రేజ్, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
ఆయన సినిమాల్లో ఉన్నా పాలిటిక్స్‌లో ఉన్నా.. ఎక్కడున్నా.. అశేష అభిమానులు ఆయన వెంటే ఉంటారు. కాగా, పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ప్రజెంట్ ప్రొడ్యూసర్స్ చాలానే ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం. ఈ సంగతులు పక్కనబెడితే.. సోషల్ మీడియాలో పవర్ కల్యాణ్‌పై చర్చ జరుగుతున్నది. పవన్ కల్యాణ్ థర్డ్ వైఫ్ అన్నా లెజినోవా పిల్లల చదువు నిమిత్తం సింగపూర్‌కు వెళ్లిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ సందర్భంలో మరి కొందరు అన్నా లెజినోవా రష్యాలో ఉంటుందని అంటున్నారు. ఆమె తన పిల్లలను సింగపూర్ లేదా మరేదైనా వేరే దేశంలో చదివించాలనుకుందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఇంగ్లిష్ మీడియం చదువులను వ్యతిరేకించిన పవన్ కల్యాణ్… తన పిల్లలను మాత్రం విదేశాల్లో చదివిస్తున్నాడా అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రోలర్స్ పవన్ ఫ్యాన్స్ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకమని ఏనాడు ప్రకటించలేదని, ఏ మీడియంలో చదవాలనేది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఇష్టానికి వదిలేయాలని అన్నారని పవన్ కల్యాణ్ అన్నారని గుర్తు చేస్తున్నారు. అయితే, పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా రష్యాలో ఉందని, లేదా సింగపూర్‌లో పిల్లలను చదివించేందుకుగాను ప్లాన్ చేస్తున్నట్లు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా కొందరు ఇలా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు. పవన్ కల్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా నిజంగానే తన పిల్లలను విదేశాల్లో చదివించాలనుకుందా? అనే విషయం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే కాని క్లారిటీగా తెలియదు. .

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *