Breaking News

పగలు కూలి పని రాత్రి పూట చదువు. రాజ రవీంద్ర కన్నీటి జీవితం

తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో మందికి గొప్ప జీవితాన్ని ప్రసాదించింది. ప్రస్తుతం ఉన్నస్థాయిలో ఉన్న నటీనటులంతా ఒకప్పుడు దుర్భర జీవితాలను గడిపినవారే. ఈ విషయాలను కొందరు నటీనటులు చాలా సందర్భాల్లో వివిధ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్య్వూల ద్వారా వెల్లడించారు. అలాంటి వారిలో స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆరిస్టులు, డైరెక్టర్లు, కమెడియన్లు కూడా ఉన్నారు. ఈ కోవలోకి నటుడు రాజా రవీంద్ర కూడా వస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్న ఈయన కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు. అయితే, రాజా రవీంద్ర సినిమాల్లోకి రాకముందు కొందరు ప్రముఖులకు మేనేజర్‌గా కూడా చేశారట..

రాజారవీంద్ర అసలు పేరు రమేష్ దంతులూరు అని, ఇండస్ట్రీకి వచ్చాక ఆ పేరుతో చాలా మంది ఉండటంతో రాజారవీంద్రగా తన పేరును మార్చుకున్నానని తెలిపారు. ఈయన సినిమాల్లోకి రాకముందు మార్కెటింగ్ రంగంలో రాణించాలని చాలా కోరికగా ఉండేదని, అందుకోసం కొంతకాలం ఫ్యామిలీ సపోర్టుతో పేపర్ మిల్లులు స్థాపించి పగలు పనిచేస్తూనే రాత్రుళ్లు చదువుకునేవాడనని వివరించారు.

మిల్లులో పనిచేస్తున్న సమయంలోనే పెదనాన్న తన డ్యాన్స్ చూసి మెచ్చుకున్నారని, ఆ తర్వాత చెన్నైకు పంపించి డ్యాన్స్ నేర్పించారని చెప్పారు. ఒక ఫేమస్ డ్యాన్స్ స్కూళ్లో చేరిన తర్వాత క్లాసులకు అటెండ్ అవుతూనే డాన్స్ పై మంచి పట్టుసాధించానన్నారు రాజా రవీంద్ర. కొంత కాలం తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా తన సినిమా కెరీర్‌ను ప్రారంభించగా, తను హీరోగా యాక్ట్ చేసిన ‘మగతృష్ణ’ అనే మూవీ టాకీసుల్లో విడుదల కాలేదన్నారు. అయినా ఆ మూవీలో తన నటనకు గాను జాతీయ అవార్డు వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయాలు పెరిగాక, ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సీనియర్ హీరో రవితేజ, నవీన్ చంద్ర, నటి జయసుధ వంటి వారికి మేనేజర్ కూడా వ్యవహరించినట్టు చెప్పుకొచ్చారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *