Breaking News

నేను ఏలియన్ ని కాదు మీ సౌందర్య ను.. దయచేసి తిట్టకండి

బ్యూటిఫుల్ హీరోయిన్ సౌందర్య తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ప్రతీ ఒక్కరికి ఇష్టమైన సౌందర్య దురదృష్టవశాత్తు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా సౌందర్య యాక్ట్ చేసింది. ఈ సంగతులు పక్కనబెడితే.. ఇటీవల జూనియర్ సౌందర్య వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

చిత్రాజీ అనే ఇన్ స్టా గ్రామ్ యూజర్ అయిన ఓ అమ్మాయి అచ్చం సౌందర్య మాదిరిగా ఉండటంతో పాటు ఆమె లాగానే యాక్ట్ చేసింది. సౌందర్య నటించిన చిత్రాల్లోని పాటలను ఆమె మాదిరిగా డబ్ స్మాష్ చేసింది చిత్రాజీ. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు చిత్రాజీ వీడియోలను బాగా వైరల్ చేశారు. సౌందర్య మళ్లీ పుట్టిందా? అనేంతలా కామెంట్స్ చేశారు. మొత్తంగా చిత్రాజీ వీడియోలు నెట్టింట బాగా హల్ చల్ చేశాయి. కాగా, ఇలా తన వీడియోలు వైరల్ కావడంపై జూనియర్ సౌందర్య చిత్రాజీ స్పందించింది. తన వీడియోలు ఇలా వైరల్ కావడం సంతోషమని తెలిపింది. తాను హీరోయిన్ సౌందర్య వీరాభిమానినని పేర్కొంది. కాకపోతే తనపై కొందరు ఏలియన్‌లా ఉన్నావ్ నువ్వు అని కామెంట్స్ చేయడం పట్ల విచారం వ్యక్తం చేసింది. తాను కేవలం సౌందర్యను గుర్తు తెచ్చేందుకు అలా చేశానని అంది. తనను ఇలా ట్రోల్ చేయొద్దని కోరింది. అయితే, సోషల్ మీడియా వేదికగా చాలా మంది నెటిజన్లు బ్యాడ్‌గా కామెంట్స్ చేస్తున్నారని, అది సరికాదని చెప్పింది. తాను అస్సలు సౌందర్య లాగా లేనని అంటున్నారని వివరించింది. తన ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ రిక్వెస్ట్ మేరకే తాను ఇన్ స్టా రీల్స్‌లో సౌందర్య నటించిన సినిమాల్లోని పాటలను డబ్ స్మాష్ చేస్తున్నానని తెలిపింది జూనియర్ సౌందర్య చిత్రాజీ. ఈ క్రమంలోనే తనకు యాక్టింగ్ రాదని, తాను హీరోయిన్ సౌందర్య లాగా యాక్ట్ చేయలేనని చెప్పింది. జస్ట్ ఇన్ స్టా రీల్స్‌లో సౌందర్యను ఇమిటేట్ చేస్తూ కొన్ని వీడియోలు చేస్తున్నానని జూనియర్ సౌందర్య తెలిపింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *