Breaking News

నెల రోజులుగా ఏకాకిలా.. వివాహ బంధాన్ని తెంచుకోలేక నాగ చైతన్య మౌన రోదన

ఏరి కోరి చేసుకున్న పెళ్లి. తొలి చూపులోనే అమ్మాయిని చూసి ఇష్ట పడ్డాడు. తనతో ఎంతో ప్రేమగా మెలిగాడు. తనూ అంతే ఇష్టంగా ఉంది. తనూ చాలా ప్రేమించింది. ఇద్దరు ఒకటి కావాలి అనుకున్నారు. ఇంట్లో వాళ్లకు అంతగా ఇష్టం లేకపోయినా.. తనే కావాలి అనుకున్నాడు. చివరకు పెద్దలను ఒప్పించాడు. అమ్మాయి తరఫు బంధువులతో ఓకే చేయించాడు. మొత్తంగా రెండు కుటుంబా పెద్దల సమక్షంలో కోరుకున్న అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. కోరుకున్న అమ్మాయి జీవితంలోకి వచ్చింది.. జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ తను అనుకున్నది అనుకున్నట్లు సాగలేదు. ఎన్నో కలలతో చేసుకున్న పెళ్లి కల్లోలం అవుతుందని ఊహించలేదు. మొత్తంగా తన పెళ్లికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఎంతో మందికి అభిమానలకు బాధ కలిగే విషయాన్ని చెప్పలేక చెప్పాడు.

అతడు మరెవరో కాదు.. అక్కినేని నాగ చైతన్య. అపురూపమైన తమ జంట విడిపోతున్నట్లు స్వయంగా ప్రకటించాడు. ఇకపై ఎవరి జీవితం వారిదన్నాడు. మొత్తంగా చాలా కాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాడు. కానీ నాగ చైతన్య చాలా సిన్సియర్ లవర్. అందుకే తన పెళ్లి విడాకుల వరకు వెళ్లడం చాలా బాధగా ఫీలయ్యాడు. ఒంటరిగానే తన బాధను దిగమింగుకునే ప్రయత్నం చేశాడు. సమంతాతో ఎప్పుడైతే విబేధాలు తలెత్తాయో.. అప్పటి నుంచి తనలో తాను కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నాడు.

అంతేకాదు.. నెల రోజులుగా తన కుటుంబ సభ్యులతో కూడా కలవడం లేదనే వార్తలు వస్తున్నాయి. గడిచిన నెల సంది ఆయన ఓ హోటల్లో ఉంటున్నాడట. అక్కడి నుంచే తన రీసెంట్ మూవీ లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడట. ఒంటరిగా తన జీవితం గురించి ఆలోచిస్తూ సమయాన్ని గడుపుతున్నాడట. అటు సమంతా సైతం ఈ బాధనుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుందట. తన మిత్రులతో కలిసి బయటకు వెళ్తుందట. అంటేకాదు.. తమ బంధం విడిపోతుందనే రీతిలో సోషల్ మీడియా ద్వారా పలు సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ. మొత్తంగా క్యూట్ కపుల్ విడిపోవడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *