Breaking News

నెట్టింట వైరల్ అవుతున్న పునీత్ రాజ్‌కుమార్, అశ్విని లవ్ స్టోరీ

కన్నడ నాట అభిమానులు ప్రేమగా పవర్ స్టార్ అని పిలుచుకునే హీరో పునీత్ రాజ్‌కుమార్. ఈయన శుక్రవారం తన ఇంట్లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే సరికి మృతి చెందారు. తమ అభిమాన నటుడు ఇకలేరని తెలిసి కన్నడ నాట తీవ్ర విషాదం నెలకొంది. పునీత్‌ మృతదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు.. సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది. పునీత్ తన చిన్నతనంలోనే బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం పవర్ స్టార్ స్థాయికి ఎదిగారు. అప్పట్లోనే పునీత్.. ఉత్తమ బాల నటుడిగా ‘జాతీయ అవార్డును’ సైతం అందుకున్నారు.

పునీత్ తన కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు అశ్విని అనే అమ్మాయిని ప్రేమించాడు. రేవంత్‌ అనే కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరు ఒకరిఒకరు పరిచయమయ్యారు. 8 నెలల స్నేహం తర్వాత పునీత్‌ అశ్వనికి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా వెంటనే ఓకే చెప్పింది. పునీత్ పెద్ద స్టార్ అని తెలిసినా తెలిసినా అశ్వని పేరెంట్స్ పెళ్లికి ఓకే చెప్పలేదు. కానీ, ఆరు నెలల పాటు కష్టపడి అశ్వని ఎలాగోలా వాళ్లింట్లో వారిని ఒప్పించింది. దీంతో 1999న డిసెంబర్ లో అశ్వని, పునీత్ రాజ్‌కుమార్ పెళ్లి పీటలెక్కారు. ఈ జంటను చూసి అందరూ ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ మెచ్చుకున్నారు. ఇరవైఏళ్లు సంతోషంగా సాగిన వీరి జీవితం పునీత్ మరణంతో శోకసంద్రంలో మునిగిపోయింది.

పునీత్ భార్య అశ్వని ప్రస్తుతం కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. చాలా మూవీస్‌కు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కూడా పనిచేశారు. 2019 సంవత్సరంలో పునీత్‌ నిర్మించిన ‘కవల్‌దారి’ మూవీని ప్రజెంటర్‌గా చేశారు. పునీత్, అశ్విని ఇద్దరూ కలిసి పీఆర్‌కే నిర్మాణ సంస్థపై అనేక చిత్రాలను నిర్మించారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *