Breaking News

నువ్వు దొరకడం నా అదృష్టం.. ప్రతి రోజు ఒక గుణపాఠం .. సమంత ఎమోషనల్

తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన సమంతా-నాగ చైతన్య వ్యవహారం డైలీ సీరియల్ ను తలపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై మొదటి నుంచి అక్కినేని ఫ్యామిలీ సైలెంట్ గానే ఉంటుంది. ఇన్ని రోజులు తన విడాకుల వ్యవహారం గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడిన సమంతా కూడా ప్రస్తుతం సైలెంట్ అయ్యింది. అయితే తన విడాకుల వ్యవహారంతో పాటు చైతన్యకు దూరంగా ఉండటం ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది. వీటి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే సమంతా మాత్రం మొన్న మొన్నటి వరకు రకరకాల అభిప్రాయాలను వెల్లడించింది. ప్రస్తుతం వేటికి స్పందించడం లేదు. కానీ పరోక్షంగా పలు అంశాల గురించి ట్వీట్లు పెడుతుంది.

తాజాగా సమంతా పెట్టిన ఓ ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తోంది. నిజాలను ఎప్పటికీ దాయలేం.. ఒకరినొకరు హర్ట్ చేసుకుని ఉండొచ్చు.. సుఖాలు కావాలంటే కష్టాలు భరించాలని.. మనం తప్పు చేస్తే అడిగే హక్కును కోల్పోతాం అని ఓ పోస్టు పెట్టింది. వీటితో పాటు పలు రకాల కొటేషన్లు సైతం ట్వీట్ చేస్తుంది. కానీ విడాకుల విషయాన్ని మాత్రం ఆమె ఎక్కడా ప్రస్తావించడం లేదు. అంతేకాదు.. సమంతకు యాభై కోట్ల భరణం ఇస్తున్నట్లు వస్తున్న వార్తలతో పాటు.. త్వరలో అధికారికంగా విడాకులు రాబోతున్నాయనే విషయాలను సైతం ఆమె ఎక్కడా ప్రస్తావించడం లేదు. .

ప్రస్తుతం సమంతా చెన్నైలో ఉంటుంది. అంతేకాదు.. కొత్తగా ఓ కుక్కను ఇంట్లోకి తెచ్చుకుంది. అటు పాతది కూడా ఒకటి ఉంది. ఈ రెండకూ కలిసి ఉండలేకపోతున్నాయట. అయితే ప్రస్తుతం ఈ రెండు కుక్కల మధ్య మంచి స్నేహం కురిరిందని వెల్లడించింది. ఈ ఘటన తనకు చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు వెల్లడించింది. ఇలాంటి ఓ ఘటన ఇంత త్వరగా చూస్తాను అనుకోలేదు. నువ్ నాకు ప్రతిరోజు ఓ కొత్త గుణపాఠాన్ని నేర్పుతున్నావు. ఇంత త్వరగా సోదరభావాన్ని ఎలా నేర్చుకున్నావ్? నువ్ నాకు దొరకడం నా అద్రుష్టం అని మరో ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *