Breaking News

నిన్న చిరంజీవి సర్జా.. నేడు పునీత్ రాజ్ కుమార్.. యంగ్ ఏజ్ లో కన్నుమూస్తున్న కన్నడ హీరోలు..

కన్నడ సినిమా పరిశ్రమలో యంగ్ టాలెంటెడ్ నటుడు అకస్మాత్తుగా చనిపోతున్నారు. కళ్లముందు ఎంతో భవిష్యత్ కనిపిస్తున్న నటులు కనుమరుగు కావడం యావత్ సినిమా పరిశ్రమను కంటతడి పెట్టిస్తుంది. గతేడాది చిరంజీవి సర్జా చనిపోయి.. కన్నడ జనాలను శోక సంద్రంలో ముంచాడు. ఆయన మరణం నుంచి తేరుకోక ముందే కన్నడ సినిమా పరిశ్రమలో మరో అద్భుత నటుడు పునీత్ రాజ్ కుమార్ చనిపోయాడు. ఆయ మరణం పట్ల యావత్ కన్నడ లోకం కంటనీరు పెట్టుకుంటుంది. కర్నాకటలో ఫేమస్ నటుడిగా ఉన్న ఆయన ఇప్పుడు ఇప్పుడే ఇతర భాషల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఆయన అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెల్లడంతో సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఆరోగ్యం గురించి పునీత్ చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. జిమ్ లో గంటల తరబడి వ్యాయామం చేసేవాడు. 46 ఏండ్ల వయసున్న ఆయనకు గుండెపోటు రావడం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన దానగుణంతో ఎందరికో అండగా నిలిస్తున్న ఆయన.. అకస్మాత్తుగా చనిపోవడంతో జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్త తెలియగానే ప్రతి ఒక్కరూ ఆయనను తలుచుకుని కంటతడి పెడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రతిఒక్కరు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

గతేడాది కూడా కన్నడ యంగ్ హీరో చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతో చనిపోయాడు 2020 జూన్ 7న కేవలం 35 ఏళ్ల వయసులో ఆయన మరణించాడు. ఆయన బిజీ హీరోగా కొనసాగుతుండగానే చనిపోయాడు. ఆయన చనిపోయే సమయానికి తన చేతిలో అర డజన్ కు పైగా సినిమాలున్నాయి. ఆయన మరణం నుంచి కన్నడ సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తాజాగా పునీత్ మరణంతో మరోసారి దుఖంలో నిండిపోయింది అక్కడి సినిమా పరిశ్రమ. పునీత్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. అందుకే ఆయనకు 90 శాతం సక్సెస్ రేటు ఉంది. కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి జనాల చేత శభాష్ అనిపించుకున్నాడు పునీత్. ఆయన మరణం నిజంగా కన్నడ సినిమా పరిశ్రమకు పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *