Breaking News

నా భార్య సంపాదించినా జీతం డబ్బులతో బ్రతికాను : రాజమౌళి

దేశం గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ఓ విద్యాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు రాజమౌళి.. ఈ క్రమంలోనే తన భార్య గురించి మాట్లాడిన రాజమౌళి.. కెరీర్ మొదట్లో పడిన కష్టాల గురించి గుర్తు చేసుకున్నాడు.

తనకు ఎడ్యుకేషన్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, అలా చదువుపై అనాసక్తి ఉండటం వల్ల తను ఎక్కువగా చదువుకోలేదని పేర్కొన్న రాజమౌళి.. తన ఇంట్లో అందరూ సినిమా వాళ్లు ఉండటం వల్ల సినిమా ప్రపంచం గురించి తెలిసిపోయిందని అన్నాడు. తండ్రి విజయేంద్రప్రసాద్ సినిమా ఇండస్ట్రీలో ఉండటం వల్ల తాను అన్ని క్రాఫ్ట్స్‌లలో పని చేశానని పేర్కొన్నాడు. దర్శకుడు అన్ని క్రాఫ్ట్స్‌పైన పట్టు ఉండాలనే ఉద్దేశంతో తాను అన్నిటిపైన పట్టు సాధించానని, అన్నిటినీ మొదటి నుంచి నేర్చుకున్నానని రాజమౌళి వివరించాడు. ఇకపోతే తాను డైరెక్టర్‌గా ట్రై చేస్తున్న తొలినాళ్లలో తన వద్ద మనీ లేవని, ఆ సమయంలో తాను తన తండ్రి విజయేంద్రప్రసాద్‌ను అడిగితే మనీ ఇచ్చేవాడని, కానీ, అడగలేకపోయానని వివరించాడు. అయితే, ఆ టైంలో తాను తన భార్య రమ వేతనం మీదనే బతికానని, ఆమెనే తనను పోషించిందని పేర్కొన్నాడు. అలా తన భార్య సంపాదన మీద బతికానని చెప్పుకోవడానికి తానేమీ సిగ్గుపడబోనని సంతోషంగా చెప్పాడు రాజమౌళి. తాను డైరెక్టర్ కాక మునుపు తన భార్యను ఆఫీసులో డ్రాప్ చేశేవాడని, ఆ తర్వాత పొద్దంతా కథలు, డైలాగ్స్, రాసుకునేవాడినని తెలిపాడు. ఆ తర్వాత కాలంలో సినిమాలోని అన్ని క్రాఫ్ట్స్ పైన పట్టు సాధించిన డైరెక్టర్ రాజమౌళి.. డైరెక్టర్ గా విజయం సాధించారు. అనంతరం తన భార్య రమా రాజమౌళిని తన సినిమాల్లోనే స్టైలిష్ట్‌గా పని చేసింది. డైరెక్టర్ రాజమౌళి తీసిన సినిమాలు ఇప్పటి వరకు ఫెయిల్ కాకపోవడం విశేషం. అయితే, రాజమౌళి అందిరిలాగా కాకుండా సినిమా తీయడానికి ఏళ్ల సమయం తీసుకుంటాడు.కానీ, తీసిన ప్రతీ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించడం గ్యారంటీ.. రాజమౌళి సినిమా వచ్చిందంటే చాలు.. సినీ ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లాల్సిందే అనేలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు రాజమౌళి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *