Breaking News

నా కొడుకు కన్ను మూయడానికి ఆమే కారణం.. అందుకే అలా చేశా: ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్.. అద్భుత నటనతో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అద్భుత సినిమాల్లో నటించాడు. తాజాగా మా ఎన్నికల బరిలోకి దిగి.. ఓటమిపాలయ్యాడు. ఈ ఎన్నికల్లో తను చేసిన పోరాటం జనాలను ఆకట్టుకుంది. అయితే తనపై పలువురు చేసిన విమర్శల పట్ల తను చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. ఎప్పటికీ తాను అతిథిగానే ఉంటాను అంటూ మా సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అయితే ప్రకాష్ రాజ్ కొంత కాలం క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి భార్యను ఎందుకు వదిలేశాడు? అనే ప్రశ్న చాలా మందికి కలిగింది. ఇంతకీ తను ఎందుకు తనను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడో వెల్లడించాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తన మొదటి భార్యతో విడిపోవడానికి గల కారణాలపై ఎవరెవరో.. ఏమేమో కామెంట్స్ చేశారని ప్రకాష్ రాజ్ చెప్పాడు. ఆ ఊహాగానాలు అన్నీ అవాస్తవాలని చెప్పాడు. తన మొదటి భార్య లలిత కుమారికి ఇద్దరు కూతుర్లు, ఒక అబ్బాయి జన్మించినట్లు చెప్పాడు. ఆమె పట్టనితనం మూలంగానే అబ్బాయి చనిపోయినట్లు వెల్లడించాడు. దీనికి తోడు తన భార్యతో వచ్చిన విభేధాల కారణంగానే తనకు విడాకులు ఇచ్చినట్లు చెప్పాడు. అయితే తను ఇప్పటికే మా అమ్మతో మాట్లాడుతుందని చెప్పాడు. విడిపోయినా.. మిత్రులుగా ఉంటున్నట్లు చెప్పాడు. తన కూతుర్లు కూడా తన తల్లితో మాట్లాడుతారని చెప్పాడు.

విడాకుల తర్వాత చాలా కాలం ఒంటరిగానే ఉన్నట్లు చెప్పాడు. రెండో పెళ్లి చేసుకోవాలని తనకు అనిపించినప్పుడు తన పెద్ద కూతురుతో పాటు తోడబుట్టిన చెల్లికి చెప్పినట్లు వెల్లడించాడు. తన నిర్ణయానికి వాళ్లు మద్దతు చెప్పినట్లు చెప్పాడు. వారి ప్రోత్సాహంతోనే రెండో పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. తన ఇద్దరు కూతుర్లు రెండో భార్య కొడుకుకు రాఖీ కడతారని చెప్పాడు. చెన్నైలో ఉంటున్న తన మొదటి భార్య దగ్గరికి అప్పుడప్పుడూ తమ కుటుంబ సభ్యులమంతా వెళ్లొస్తామని చెప్పాడు. అందరం ఇప్పుడు సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *