Breaking News

నా కూతురుతో ఎటువంటి సంబంధం లేదంటున్న ప్రకాశ్ రాజ్.. కారణం అదేనట..

ప్రకాశ్ రాజ్ తన నటనతో సరిహద్దులను చెరిపివేసిన నటుడు. ఎన్నో నంది అవార్డులతో పాటు జాతీయ అవార్డును కూడా గెలుచుకున్న కళామతల్లి ముద్దు బిడ్డ. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపే. మరో వైపు ప్రకాశ్ రాజ్ జీవితం వేరేలా ఉంది. ప్రకాశ్ రాజ్ రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, అతడి వ్యక్తిగత జీవితంలో అనేక మరకలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోని ప్రకాశ్ రాజ్ ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ రీసెంట్ గా జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పరువు మరింత దిగజారింది. కర్ణాటక నుంచి వచ్చిన ప్రకాశ్ రాజ్ ఇక్కడ పోటీ చేసి ఎలాగైనా సరే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ ఊహించని విధంగా మంచు విష్ణు గెలిచే సరికి ప్రకాశ్ రాజ్ కు దిమ్మ తిరిగిపోయిందనే చెప్పాలి.

ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు, జీవిత రాజశేఖర్, హేమ వంటి నటులు ఎంత మంది సపోర్టుగా నిలిచినా కానీ ప్రకాశ్ రాజ్ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కూడా ప్రకాశ్ రాజ్ అనేక ఆరోపణలు చేశాడు. ఇక ఆ వివాదం సంగతి పక్కన పెడితే ప్రకాశ్ రాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కూతురుతో తనకు ఎటువంటి సంబంధం లేదని సెలవిచ్చాడు. అసలు ప్రకాశ్ రాజ్ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందని ఒక సారి పరిశీలిస్తే..

డిస్కో శాంతి చెల్లెలు లలితను పెళ్లి చేసుకుని ఆమెతో ముగ్గురు పిల్లల్ని కని విడాకులు ఇచ్చాడు ప్రకాశ్ రాజ్. వారికి పుట్టిన పెద్ద కూతురు విషయంలో ప్రకాశ్ రాజ్ తనకు సంబంధం లేదని చెబుతున్నాడు. పెద్ద కూతురు వల్లే తాను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని పలు మార్లు చెప్పాడు. కెరీర్ పరంగా ఓ తండ్రిగా ఆమెకు అండగా.. ఉంటా కానీ పెళ్లి సమయంలో మాత్రం ఆమెకు తండ్రిగా ఉండలేనని కుండ బద్దలు కొట్టాడు ప్రకాశ్ రాజ్. ఈ ఇంటర్వ్యూను చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *