Breaking News

నా కూతురికి అసలు నటించాడమే రాదు అందుకే ప్లాప్ హీరోయిన్ అయ్యింది .. రాధ సంచలన వ్యాఖ్యలు

సినిమా పరిశ్రమలో వారసుల రాక అనేది చాలా కామన్. ఆయా సినిమా పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన నటీనటుల పిల్లలు హీరోలుగా, హీరోయిన్లుగా అడుగు పెట్టడం అనేది ఎప్పటి నుంచో వస్తోంది. అయితే ఇలా వచ్చిన వారిలో చాలా మంది ఫెయిల్ అయ్యారు అనే చెప్పుకోవచ్చు. ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే వారసత్వాన్ని ఆసరాగా చేసుకుని సినిమా పరిశ్రమలోకి వచ్చినా.. సొంత టాలెంట్ తో సత్తా చాటుకున్నారు. అలా వచ్చిన వారిలో రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. మంచి సినిమాల్లో నటిస్తూ చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు.

అటు మరికొంత మంది మాత్రం తమకున్న సినిమా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టినా.. ఒకటి రెండు సినిమాల్లో సక్సెస్ అయి.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ అలనాటి అందాల తార రాధ కూతురు కార్తీక. ఈ ముద్దుగుమ్మ అక్కినేని నాగార్జున నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్ తో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ ఆమె కెరీర్ మీద చాలా పడింది. అంతేకాదు.. తొలి సినిమాతోనే తను ఫ్లాప్ సాధించడంతో ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు కూడా దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే తను ఫెయిల్యూర్ హీరోయిన్ గా ముద్ర తెచ్చుకుంది.

తొలి సినిమాతో ఫ్లాప్ సాధించిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత రంగం సినిమాలో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా మాత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. జీవా, కార్తీక హీరో, హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమా మాత్రం మంచి సక్సెస్ అందుకున్నా.. కార్తీక కెరీర్ కు మాత్రం ప్లస్ కాలేదు. తన కూతురు సక్సెస్ కాకపోవడానికి గల కారణాన్ని చెప్పింది ఆమె తల్లి రాధ. తమకున్న క్రేజ్ ను ఉపయోగించుకోలేక పోవడంతో పాటు తన నటనతో జనాలను ఆకట్టుకోలేకపోయిందని చెప్పింది. ఈ రెండు కారణాల మూలంగానే తను ఫెయిల్యూర్ హీరోయిన్ గా మారినట్లు చెప్పింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *