Breaking News

నా కూతురికి అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు : సమంత తండ్రి

సమంత, నాగ చైతన్య మధ్య రగులుతున్న గొడవపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ఇంతకీ వీరు విడిపోతున్నారా? విడాకులు ముచ్చట ఎక్కడి వరకు వచ్చింది? సమంత అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటుందా? ఇకపై కలిసే అవకాశం లేదా? అనే ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ప్రశ్నలుగానే ఉన్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందనే విషయాన్ని పక్కకు పెడితే తాజా పరిణామాలు మాత్రం.. సమంతా, అక్కినేని ఫ్యామిలీకి మధ్య పెద్ద అగాథం ఏర్పడిన మాట వాస్తవం అనేది తెలుస్తోంది.

2017లో సమంత, నాగచైతన్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ పలు సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత కూడా సమంతా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం లాంటి సినిమాతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. పలు సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేసింది. అక్కినేని కుటుంబం నుంచి ఇలాంటి పాత్రలు చేయకూడదు అనే ఒత్తిళ్లు వస్తున్నా.. సమంతా పట్టించుకోలేదనే మాట వినిపిస్తోంది. సమంతా ఎప్పటి మాదిరగానే గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ముందుకు సాగింది. హాట్ హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంది. దీంతో అక్కినేని ఫ్యామిలీకి, సమంతాకు మధ్య దూరం మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ -2లో మరింత బోల్డ్ గా నటించింది. దీంతో నాగచైతన్య, సమంతా మ్యారీడ్ లైఫ్ క్లీన్ బౌల్డ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరికి విడాకులు మంజూరు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం సమంతా చెన్నైలో ఉంటుంది. అటు విడాకుల భరణం కింద అక్కినేని ఫ్యామిలీ సమంతాకు రూ.50 కోట్ల భరణం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత సమంతా విషయంలో అక్కినేని ఫ్యామిలీ మరింత ఒత్తిడి తెచ్చినట్ల తెలుస్తోంది. సినిమాటిక్ గా కాకుండా సంప్రదాయ బద్ధంగా మారాలని ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే తన జీవితం మీద ఆంక్షలకు సమంతా సిద్ధంగా లేకపోవడమే ప్రస్తుత పరిణామాలకు కారణం అనే విషయం వెల్లడి అవుతుంది. ఈ విషయంలో సమంత తలిదండ్రులు కూడా అక్కినేని ఫ్యామిలీ పై కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. తన కూతురికి ఆంక్షలు పెట్టడం పట్ల వారు ఒకింత అసహనానికి గురవుతున్నట్టుగా గా కూడా తెలుస్తుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *