Breaking News

నాగ చైతన్య ఆవేదన.. తమ జర్నీకి బ్రేక్ పడటం బాధిస్తుందని వెల్లడి..!

శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో వసూళ్లను చేపడుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి నటన అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ జరిగింది. లవ్ స్టోరీ వేళ శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించాడు నాగ చైతన్య. ఇక సినిమా విడుదల అయిపోయింది కాబట్టి తనతో ఇక ప్రయాణం చేసే అవకాశం లేదని చెప్పాడు. అందుకు చాలా బాధపడుతున్నట్లు వెల్లడించాడు. మున్ముందు కూడా తనతో కలిసి పనిచేస్తానని తన మనసులోని మాటను చెప్పాడు.

అటు ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే జనాల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాని చైతన్య చెప్పాడు. తన సినిమా గురించి విమర్శకుల వర్షన్ కూడా వింటున్నట్లు చెప్పాడు. లవ్ స్టోరీ విడుదల పట్ల ఎంతో సంతోష పడ్డట్లు చెప్పాడు. కరోనా మహమ్మారి తర్వాత జనాలు థియేటర్లలోకి వచ్చి సినిమాలు చూడటం సంతోషంగా ఉందన్నాడు. తన సినిమాను ఆదరించిన జనాలకు ధన్యవాదాలు చెప్పాడు. ఇలాంటి సినిమాలు శేఖర్ కమ్ములతో కలిసి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు.

సినిమా యూనిట్ అంతా కలిసి మెలిసి పని చేయడం మూలంగా లవ్ స్టోరీ మూవీ మంచి విజయాన్ని అందుకుందని హీరోయిన్ సాయి పల్లవి వెల్లడించింది. ఈ సినిమాను జనాలు బాగా ఆదరిస్తున్నారని చెప్పింది. తమ సినిమాను చూసి హిట్ చేసిన వారిందరికీ థ్యాంక్స్ చెప్పింది. తమ సినిమా గురించి జనాలు ఇస్తున్నపాజిటివ్ కామెంట్స్ తమలో చాలా సంతోషాన్ని నింపుతున్నాయని వెల్లడించింది. అటు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా విడుదలపై చాలా అనుమానాలు ఉండేవని దర్శకుడు శేఖర్ కమ్ముల వెల్లడించాడు. అయితే సినిమా విడుదల అయ్యాక తన అంచనాలకు మించి జనాదరణ దక్కిందని వెల్లడించాడు. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? అని అనుకున్నట్లు వెల్లడించాడు. కానీ తాము అనుకున్నదాని కంటే మంచి రిజల్ట్ వచ్చిందన్నాడు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *