Breaking News

నాగార్జున ధరించిన షర్ట్ ఖరీదు తెలిస్తే గుండె గుబేల్

మన్మధుడు నాగార్జున వరసగా మూడో సారి వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తూ టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. గత సీజన్స్ తో పోలిస్తే ఈ ఐదవ సీజన్ టీఆర్పీ రేటింగ్స్‌ కూడా చాలా బాగా వస్తున్నాయి. కింగ్ నాగార్జున తన స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో మరింత జోష్ గా, గ్లామరస్ గా కూడా కనిపిస్తూ యూత్ ఐకాన్ గా మారిపోయారు. ఇక బిగ్ బాస్ సీజన్ వారాంతంలో నాగార్జున వేసుకునే డ్రెస్సెస్ పైన సోషల్ మీడియాలో జోరుగా చర్చ కూడా నడుస్తుంది. ఒక్కో వారం ఒక్కో రకమైన డ్రెస్ తో యూత్ ని కట్టి పడేస్తున్నారు.

ఇక గత వారం నాగార్జున వేసుకున్న ఒక షార్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ షికార్లు కొడుతుంది. నాగార్జున ధరించిన ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ ( Etro Paisley Silk Shirt) లుక్ తో మెస్మరైజ్ చేసాడు. ఇక ప్రస్తుతం ఈ షర్ట్ గురించి, అలాగే దాని ధర గురించి సోషల్ మీడియాలో వెతుకులాట మొదలయ్యింది. దీనికి ధర ఎంత ఉండి ఉండవచ్చు సెర్చ్ చేసారు నెటిజన్స్. అయితే తెలుస్తున్న వివరాల ప్రకారం దీని వేల అక్షరాలా $1,110 యూఎస్ డాలర్స్. అవునండి మీరు వింటుంది నిజమే. దేని రేటు మన ఇండియన్ కరెన్సీలో 82,211 రూపాయలు మాత్రమే. షాక్ తిన్నారా, వేసింది మన నాగార్జున అయితే ఆ మాత్రం ధర ఉండాల్సిందే కదా. అసలే అక్కినేని అందగాడు. ఆ మాత్రం డబ్బులు పెట్టి బట్టలు కొనుక్కోవడం పెద్ద విశేషం ఏముంది అంటున్నారు అక్కినేని ఫాన్స్. ఇక నాగార్జున ప్రస్తుతం ‘ది ఘోస్ట్’, ‘బంగార్రాజు’ సినిమాలలో నటిస్తున్నాడు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *