Breaking News

నాగార్జునకు అమలకు చెడిందా.. వీళ్లు కూడా విడిపోనున్నారట.. అందుకోసమేనా.

టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో ఈ స్టార్ హీరో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్నాడు. కానీ ఈ హీరో మాత్రం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. విక్టరీ వెంకటేశ్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్న ఆయనకు 1986లో నాగచైతన్య జన్మించాడు. కానీ ఏమైందో ఏమో కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వీరు విడాకులు తీసుకున్నారు. ఇక అటు తర్వాత నాగ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందగత్తె అమలను 1992లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

మొదట వీరి ప్రేమ వివాహానికి నాగేశ్వరావు ఒప్పుకోకపోయినా తర్వాత సన్నిహితులు ఒప్పించారు. వీరికి 1994లో అఖిల్ జన్మించాడు. ఇక అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరికి ప్రస్తుతం చెడిందని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా నాగ్ పెద్ద కొడుకు చైతన్య స్టార్ హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్నాడు. అదే తోవలో నాగ్ అమల జంట కూడా ప్రయాణించనుందని ఫిల్మ్ నగర్ టాక్. అసలు వీరిద్దరికీ ఏ విషయంలో మనస్పర్థలు వచ్చాయనే విషయానికి కూడా ఓ కారణం చెబుతున్నారు. ఈ మోస్ట్ క్యూట్ కపుల్ కు తిండి విషయంలో మనస్పర్థలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అవును అమల వెజిటీరియన్. కానీ నాగ్ కు మాత్రం ముక్క లేనిదే ముద్ద దిగదట. అమల బ్లూ క్రాస్ సంస్థ మెంబర్ కూడా. జీవహింసకు తాను వ్యతిరేఖి. కావున ఇంట్లో కూడా నాన్ వెజ్ వండకూడదని ఆమె షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వీరిద్ధరికీ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఏమవుతుందో వేచి చూస్తే గానీ తెలియదు. అప్పుడెప్పుడో 1986లో విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీ గడప తొక్కిన నాగ్ ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నాడు. నాగ్ కు ఇద్దరు కొడుకులున్నా వారిద్దరి కంటే అతడికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని పలువురు చెబుతారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *