Breaking News

నాగచైతన్యతో డైవోర్స్ విషయమై క్లారిటీనిచ్చిన సామ్.. ఇన్ స్టా లైవ్‌లో అభిమానుల ప్రశ్నల వర్షం

గత కొద్ది రోజుల నుంచి అక్కినేని నాగచైతన్య -సమంత డైవోర్స్ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ విషమయై అటు నాగచైతన్య కాని సమంత కాని నాగార్జున కుటుంబసభ్యులు కాని ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, తాజాగా సామ్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. ‘సాకీ’ క్లాత్ బ్రాండ్ స్టార్ట్ చేసి ఏడాది అయిన సందర్భంగా సమంత ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ‘సాకీ వన్ ఇయర్ సెలబ్రేషన్స్’లో సామ్ పర్సనల్ లైఫ్‌పై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత నాగచైతన్య విడిపోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ మీడియాలో కూడా ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. విడాకుల విషయంలో ఇప్పటికే అనేక రకాల ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. ఇక ఇందులో ఏవి నిజమో తెలియక అభిమనులు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పైగా ఇప్పటివరకు ఎవరి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అప్పుడప్పుడు సమంత మాత్రమే పరోక్షంగా స్పందిస్తున్నప్పటికి కూడా అందులో కూడా సరైన క్లారిటీ రావడం లేదు. ఇక ఫైనల్ గా ఒక విషయం పై అయితే సమంత కుండ బద్దలు కొట్టేసింది. అభిమానుల ప్రశ్నలను తట్టుకోలేక సమంత లైవ్ లోనే ఒక క్లారిటీ వచ్చేసింది.

అక్కినేని ఫ్యామిలీ వారు పెట్టిన కండిషన్స్ బ్రేక్ చేయడం వల్లే నాగచైతన్య -సామ్ మధ్య గ్యాప్ వచ్చిందని, అలా వీరు కౌన్సెలింగ్ దశ వరకు వెళ్లారని, భరణం కూడా ఇచ్చేందుకు నాగార్జున కుటుంబీకులు సిద్ధమయ్యారని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఇకపోతే ఈ విషయమై స్పందించకపోగా సోషల్ మీడియాలో డిఫరెంట్ పోస్టులు పెట్టింది సామ్. నాగచైతన్య సైతం డైరెక్ట్‌గా విషయంపై స్పందించకుండా ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ సక్సెస్‌ను చై ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సంగతులు ఇలా ఉంచితే.. సమంత ‘సాకీ బ్రాండ్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్’లో భాగంగా నెటిజన్లు, అభిమానులతో ఇన్ స్టా వేదికగా ముచ్చటించింది. ఈ క్రమంలో అభిమానులు సామ్ పై ప్రశ్నల వర్షం కురి‌పించారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇన్‌డైరెక్ట్‌గా ఇచ్చి తప్పించుకున్న సామ్.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాత్రం డైరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చేసింది. మీరు ముంబై వెళ్లిపోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు సామ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇచ్చింది. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, అసలు తనపైన రూమర్స్ ఎలా ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని తెలిపింది. తాను హైదరాబాద్ వదిలిపెట్టేది లేదని, హైదరాబాద్‌లోనే ఉంటానని స్పష్టం చేసింది. అంటే మొత్తంగా తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు, చైతుతో కలిసి ఉంటున్నట్లేనని ఇన్ డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చేసింది. ఇకపోతే అక్టోబర్ 7న చై-సామ్ పెళ్లి రోజు సందర్భంగా డైవోర్స్ విషయమై ఫుల్ క్లారిటీ వచ్చే చాన్సెస్ ఉంటాయని అభిమానులు అంటున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *