Breaking News

నయనతార మొదటిసారి ఎప్పుడు ప్రేమలో పడి మోసపోయిందో తెలుసా..?

నయనతార.. ప్రజెంట్ ‘లేడీ సూపర్ స్టార్‌’గా కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉంది. తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ఓ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంది. గ్లామరస్ రోల్స్‌తో పాటు ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తూ సత్తా చాటుతోంది నయన్. అయితే, ఒకప్పుడు తాను అందంగా లేనని నయన్ బాధపడిందట. నిజానికి ఆమె లేడీ సూపర్ స్టార్‌గా మారడానికి ఆమెను ప్రేమించిన ఓ యువకుడే కారణమని తెలుస్తోంది. అతను ఎవరంటే..

1984 నవంబర్ 18న బెంగళూరులోని ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జన్మించిన నయన్.. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా ఉంది. నయనతారకు ఆమె తల్లిదండ్రులు ‘డయాన్ మరియా కురియన్’ అని పేరు పెట్టారు. కేరళలోని తిరువల్ల టౌన్‌లో నయన్ బాల్యం గడిచింది. ఇకపోతే నయన్ డిగ్రీ మార్తోమా కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివింది. ఈ సమయంలోనే ఆమె లైఫ్‌లోకి ఓ కుర్రాడు వచ్చాడట. నయనతారను ప్రేమించడమే కాదు ఆరాధించాడట. అయితే, నయన్‌ను ప్రేమించిన ఆ కుర్రాడు కొద్దిరోజుల తర్వాత మరో అమ్మాయిని ప్రేమించి నయన్‌ను వదిలేశాడు. దాంతో నయన్ చాలా బాధపడి, నలుగురిలోకి రావడానికి చాలా ఇబ్బంది పడింది. ఇక ఆ టైంలోనే తనను వదిలేసిన యువకుడు తన అందాన్ని చూసి బాధపడేలా చేయాలనుకుంది నయన్.

అంతే.. ఇక మోడలింగ్ రంగంలోకి దిగింది. పలు లోకల్ బ్రాండ్స్‌కు మోడలింగ్ చేసి మంచి పేరు సంపాదించిందుకుంది. ఈ క్రమంలోనే స్థానికల మీడియా చానల్‌లో యాంకర్‌గా చేరింది. అలా యాంకరింగ్ చేస్తున్న క్రమంలో వనిత మ్యాగజైన్‌లో నయన్ మోడలింగ్ ఫొటో పబ్లిష్ అయింది. అది చూసి మాలీవుడ్ డైరెక్టర్ సత్యం అంతికాడ్ ‘మానసికారే’ ఫిల్మ్‌లో చాన్స్ ఇవ్వగా వెండితెర మీదకు వచ్చింది. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది నయనతార. తనను వదిలేసిన యువకుడి మీద కోపంతోనే కసిగా కెరీర్ మొదట్లో మోడలింగ్, ఆ తర్వాత సినిమాలు చేసింది నయన్. క్రమంగా లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. నయన్ ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రంతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తె’ ఫిల్మ్‌లోనూ నటిస్తోంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *