Breaking News

నయనతార కి ఆ సమస్య ఉందా ? విగ్నేష్ ని కాదని పెళ్లి కూడా చేసుకుందా ?పెళ్ళికొడుకు ఎవరో తెలుసా?

నాలుగు పదుల వయసులో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతుంది అందాల తార నయనతార. ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. చాలా కాలంగా ఈ జంట చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతుంది. ఇన్నాళ్ల ప్రేమయణాన్ని ముగించి.. వివాహ బంధంతో ఏడడుగులు వేయాలని భావిస్తున్నారు. అయితే నయన తార విష్నేష్ తో పెళ్లి కంటే ముందే ఇంకో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ తను పెళ్లి చేసుకునేది ఎవరితో అనే అంశం ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది.

నయనతార-విఘ్నేష్ శివన్ కొత్త జీవితంలోకి అడుగు ఎప్పుడెప్పుడు పెట్టాలా అని ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే నయనతార క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి మారింది. అయినా వీరి పెళ్లికి పలు ఆటంకాలు వస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నయనతార జన్మించిన సమయం చాలా దోషాలతో ముడిపడి ఉందట. పెళ్లికి ముందే వాటికి నివారణ చేయాలట. ఇందుకోసం పలువురు పండితులు పలు సూచనలు ఇచ్చారట. ఈ దోష నివారణ చేయకపోతే కట్టుకోబోయే వాడికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారట.

పండితుల సూచనలు పాటించేందుకు రెడీ అవుతున్నారట విష్నేష్ నయన్. విఘ్నేష్ కంటే ముందుగా ఈ ముద్దుగుమ్మ చెట్టును పెళ్లి చేసుకోవాలని చెప్పారట. అప్పుడే సమస్యలు తొలిగిపోయే అవకాశం ఉంటుందని వెల్లడించారట. దీంతో ఆమె తొలుత చెట్టును వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారట. ఆ తర్వాతే వీరి అసలు పెళ్లి జరగాలని సూచించారట. నిజానికి ఈ సంప్రదాయం చాలా కాలంగా ఉంది. పలువురు పెళ్లి కంటే ముందు చెట్టునో.. వేరే జంతువునో పెళ్లి చేసుకోవడం తరుచుగా చూస్తున్నాం. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ కూడా అభిషేక్ ను పెళ్లి చేసుకోవడం కంటే ముందు తను ఓ చెట్టును వివాహం చేసుకుంది. అప్పట్లో దీనిపై అనేక విమవర్శలు కూడా వచ్చాయి. కానీ వాటిని బచ్చన్ ఫ్యామిలీ పట్టించుకోలేదు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *