Breaking News

నమ్మిన జూనియర్ ఎన్టీఆర్.. నట్టేట ముంచిన టాప్ డైరెక్టర్లు

జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నందమూరి హీరో.. పలు ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. టాప్ హీరోగా వెలుగొందాడు. తాజాగా ఆయన ఆర్ ఆర్ ఆర్ అనే మన్ ఇండియన్ మూవీతో జనాల ముందుకు రాబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే ఎన్టీఆర్ కొంత మంది దర్శకులను నమ్మి నట్టేట మునిగాడట. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

జూనియర్ ఎన్టీఆర్ పలువురు దర్శకులతో పలు సినిమాలు చేశాడు. వారిలో పలువురు సూపర్ డూపర్ హిట్ల ఇచ్చారు. మరికొందరు ప్లాపులు ఇచ్చారు. అయితే ఇద్దరు దర్శకులను మాత్రం ఆయన బాగా నమ్మాడు. ఫ్లాపులు ఇచ్చినా నమ్మి.. రెండో అవకాశం ఇచ్చాడు. అయితే ఆయనకు గట్టి దెబ్బ వేశారు ఆదర్శకులు. వారిలో ఒకడు మెహర్ రమేష్. ఈయన మెగా ఫ్యామిలీకి దగ్గరి దర్శకుడు. అక్కడ అవకాశాలు రాక.. ఎన్టీఆర్ తో కంత్రి అనే సినిమా తీశాడు. అది ఘోర పరాజయం పొందింది. ఆ తర్వాత శక్తి అనే సినిమాకు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధిస్తుందని కథలు చెప్పాడు రమేష్. ఆయన మాటలు నమ్మాడు ఎన్టీఆర్. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో ఎన్టీఆర్ ఆయనను పక్కన పెట్టాడు.

ఎన్టీఆర్ కు గట్టి దెబ్బ కొట్టిన మరో దర్శకుడు సురేంద‌ర్‌రెడ్డి. ఈయనతో కలిసి ఎన్టీఆర్ అశోక్ సినిమా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా తనను నమ్మి ఊసరవెల్లి సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యాడు ఎన్టీఆర్. నిజానికి ఈయన రెండు సినిమాలు విజయం సాధిస్తే ఎన్టీఆర్ ఓ రేంజికి వెళ్లేవాడు. కానీ ఆ అవకాశాన్ని దక్కకుండా చేశాడు సురేందర్ రెడ్డి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *