Breaking News

నన్ను వదిలేసినందుకు ధన్యవాదాలు : సమంత

టాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపేసిన ఘ‌ట‌న.. ఈ సంవ‌త్స‌రంలో ఇదే అతి పెద్ద వార్త‌గా మిగిలిపోయింది. అదే స‌మంత‌, చైతుల విడాల‌కు వ్య‌వ‌హారం. ఎప్ప‌టి నుంచో స‌మంత‌, చైతూల విడాకులు అనే వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయినా వాటిపై వారిద్ద‌రూ పెద్ద‌గా స్పందించ‌లేదు. దీంతో అనేక ర‌కాల రూమ‌ర్లు చెక్కర్లు కొట్టాయి. విడివిడిగా పార్టీల‌కు రావ‌డం, విడివిడిగానే ట్రిప్‌ల‌కు వెళ్ల‌డ‌తో నిజ‌మే అంటూ మీడియా కోడై కూసింది. ఇంత‌లోనే తామిద్ద‌రం విడిపోతున్న‌ట్టు ఇరువురూ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. దీంతో టాలీవుడ్ లో ఓ పెద్ద వార్త అయిపోయింది.

ఇంకేముంది మ‌న తెలుగు మీడియా ఆ విష‌యంపై చాలా ర‌కాల స్టోరీలు అల్లేసింది. స‌మంత విడాకులు తీసుకోవ‌డానికి ఆమె చేస్తున్న బోల్డ్ సినిమాలే కార‌ణ‌మ‌ని, అక్కినేని ఫ్యామిలీ పెడుతున్న కండీష‌న్లు త‌ట్టుకోలేక‌నే విడాకులు తీసుకుంద‌ని ఇలా చాలా ర‌కాల రూమ‌ర్లు మీడియాలో వినిపించాయి. ఇంకొన్ని మీడియాల్లో అయితే చైత‌న్య అమాయ‌క‌త్వం కార‌ణంగానే స‌మంత ఇలా చేసిందని కూడా అంటున్నారు. ఇల ఒక‌టా రెండా ప్ర‌తిరోజూ మీడియాలో వీరి గురించే పెద్ద చ‌ర్చ సాగింది. దీంతో అటు స‌మంత‌, ఇటు నాగ‌చైత‌న్య చాలానే ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది.

అయితే వీరిద్ద‌రికీ ఇప్పుడు పెద్ద రిలీఫ్ దొరికింది. అదెలా అంటే మీడియా ఇప్పుడు వీరి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు. మా ఎన్నిక‌ల‌పై మీడియా ఫోక‌స్ పెట్టింది. దీంతో వారి మ్యాట‌ర్ ప‌క్క‌కు పోయింద‌నే చెప్పొచ్చు. ఇక ప్ర‌జ‌లు కూడా వీరి టాపిక్‌ను సోష‌ల్ మీడియాలో పోస్టులు చేయ‌డం మానేశారు. ఆ కార‌ణంగా స‌మంత‌కు బిగ్ రిలీఫ్ దొరికింద‌న్న‌మాట‌. ఎందుకంటే చైత‌న్య కంటే కూడా స‌మంత‌పైనే ఎన్నో ర‌కాలు రూమ‌ర్లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమెకు ఇది చాలా రిలీఫ్‌గా ఫీల‌య్యే అంశ‌మ‌నే చెప్పాలి. ఏదేమైనా ఆమె వ్య‌క్తిగ‌త అంశాల గురించి ఇక‌పై మీడియాలో పెద్ద‌గా టాపిక్ న‌డ‌వ‌ద‌నే అనిపిస్తోంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *