Breaking News

నన్ను దారుణంగా వాడుకొని మోసం చేశారు.. ‘ముమైత్ ఖాన్’ సంచలన కామెంట్స్

ముమైత్ ఖాన్.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఐటం సాంగ్స్. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఐటం సాంగ్స్‌కు స్టెప్పులేస్తే తమ కెరీర్‌ ముగిసినట్లే అని అప్పట్లో హీరోయిన్లు భావించేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్లు కూడా తమ అందాలు ఆరబోస్తున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో ఐటం సాంగ్స్‌కు కూడా ఒకే చెప్తున్నారు.
పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన పోకిరి మూవీ భారీ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డ్స్ అన్నింటినీ తిరగరాసి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఈ మూవీలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అనే స్పెషల్ సాంగ్‌తో ముమైత్ ఖాన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

తొలి సినిమా హిట్ కావడంతో ముమైత్‌కు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. దీంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఐటం సాంగ్స్‌తో పాటు కొన్ని సినిమాల్లోనూ ఆఫర్లు వచ్చాయి. ముమైత్ డ్యాన్స్‌, ఆమె అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. అయితే, కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల కారణంగానే చిన్న వయసులో డ్యాన్స్ నేర్చుకుని, చిత్ర పరిశ్రమలోకి ముమైత్ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో ఆఫర్లు, పారితోషికం విషయంలో చాలా మంది నటులు మోసపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ కోవలోకే ముమైత్ ఖాన్ కూడా వస్తుంది. ఓ నిర్మాత తనను వాడుకుని వదిలేసినట్టు ఆమె సంచలన కామెంట్స్ చేసింది. 2009లో రిలీజ్ అయిన పున్నమినాగు అనే సినిమాలో ముమైత్ కీ రోల్ పోషించింది. దీనిని కోదండరామి రెడ్డి డైరెక్షన్ చేశాడు. ఈ మూవీలో ముమైత్ ఓ పాత్రలో పాముగా, సాధారణ పౌరురాలిగా మరో పాత్ర పోషించింది. ఈ సినిమాను రాయల్ ఫిలిం కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్‌పై విజయ్ కుమార్ తెరకెక్కించాడు.

ఇందులో ముమైత్ ఖాన్ బట్టలు విప్పి (ఎక్స్ పోజింగ్) చేస్తే డబ్బులు ఎక్కువగా ఇస్తానని నిర్మాత చెప్పారట. మూవీ రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల నుంచి స్పందన అంతగా రాలేదు. దీంతో ఆమెకు డబ్బులు చెల్లించకుండా తనను వాడుకుని మోసం చేసాడని ముమైత్ సంచలన కామెంట్స్ చేసింది. తెరపై తన అందచందాలను చూపిస్తే.. డబ్బులివ్వకుండా మోసం చేస్తారా అని బాధ పడింది. తాను అంతలా ఎక్స్‌పోజింగ్ చేయడం వల్లే ఓపెనింగ్స్ వచ్చాయని.. లేకపోతే అవి కూడా రాకపోయేవని తెలిపింది. తనను మోసం చేసినందుకే నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కూడా చెప్పుకొచ్చింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *