Breaking News

నన్ను చూడగానే చెప్పులు విసిరారు.. ఆ ఘటన తల్చుకుని బాధపడ్డ రమ్యకృష్ణ

రమ్యకృష్ణ.. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి గొప్ప నటిగా పేరు సంపాదించింది. నరసింహ సినిమాలో నీలాంబరిగా.. బాహుబలి సినిమాలో శివగామిగా.. ఎన్నో సినిమాల్లో దేవతగా తెలుగు జనాలను అమితంగా ఆకట్టుకుంది. 1992 నుంచి 2002 వరకు ఎన్నో భాషల్లో.. ఎన్నో సినిమాలు చేసింది. టాప్ హీరోయిన్ గా మారి.. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లోని పలువురు టాప్ హీరోలతో కలిసి నటించింది. తన అందాలతో అన్ని వయసుల వారిని ఉర్రూతలూగించింది. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక కూడా రమ్యకృష్ణ అద్భుత రీతిలో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ విషయాన్ని వెల్లడించింది. తన కెరీర్ లో ఆ ఘటనను మర్చిపోలేనని చెప్పింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర చేసి.. అదంరినీ ఎంతో ఆకట్టుకుంది. రజనీకాంత్ తో పోటీపడి మరీ నటించింది. రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా కాకుండా నెగెటివ్ రోల్ చేసి సంచలనం కలిగించింది. ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన సౌందర్య పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుండేదని తను చాలా సార్లు అనుకుందట. ఎలాగోలా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించింది. ఆ సినిమా విడుదల అయిన తొలి రోజు తన చెల్లి ఓ థియేటర్ కు వెళ్లింది. అక్కడ తెర మీద రమ్య కనిపించగానే జనాలు చెప్పులు విసిరారట. ఆ విషయం తనతో చెప్పినప్పుడు చాలా బాధ పడినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తన పాత్రకు మంచి పేరు రావడం తనకు సంతోషం కలిగించినట్లు చెప్పింది.

బాహుబలి సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ.. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీలో కీ రోల్ ప్లే చేసింది. అటు పూరీ కొడుకు ఆకాష్ సినిమా రొమాంటిక్ లోనూ నటించి మెప్పింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా లైగర్ లోనూ నటిస్తోంది. అటు బంగార్రాజు సినిమాలో నాగార్జున సరసన నటిస్తోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *