Breaking News

నన్ను క్షమించండి ఆంటీ అంటూ చైతన్య తల్లికి ఫోన్ చేసి గుక్క పెట్టి ఏడ్చిన సమంత..?

సమంతా , నాగ చైతన్య విడిపోతున్న ప్రకటించినా.. ఎవరికి వారు వేర్వేరుగా ఉండబోతున్నట్లు చెప్పినా.. ఇంకా వారి గురించి వార్తలు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. తన మిత్రులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమలోని పలువురి నుంచి ఆమెకు మద్దతు వస్తున్నా.. తను మాత్రం ఇంకా బాధ పడుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. తన విడాకుల గురించి ఇంకా కారణాలు వెతికే పనిలోనే ఉన్నారు పలువురు నెటిజన్ పరిశోధకులు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటూ మానసిక ఆందోళనకు, బాధకు గురవుతున్నది సమంతా.

అట సమంతా తన భర్త నుంచి విడిపోయిన తర్వాత తొలిసారి తన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇండోర్ ఫ్లాంట్లతో తెల్లటి షీట్ తో కలిపి తీసిన ఫోటో అది. తెల్లని వస్త్రాల్లో ఆమె మెరిసిపోతూ కనిపించింది. ఆమె జుట్టుపై గులాబీతో పాటు తెల్లని పువ్వులు కనిపించాయి. అవి తనకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

అటు సినిమాకు సంబంధించిన పలువురు నటీనటులు ఈ జంట ఎడబాటు గురించి పలు రకాల రియాక్షన్స్ ఇచ్చారు. హీరో సిద్ధార్థ్ మాత్రం మోసగాళ్లు మోసపోవడం కామన్ అని చెప్పాడు. సమంతాపైతన కసిని బయటకు వెల్లగక్కాడు. అటు సమంతా ఫ్యాషన్ డిజైనర్ సమంతాకు మద్ధతుగా పలు ట్వీట్స్ చేశాడు. అటు పలువురు సమంతాకు వ్యతిరేకంగా కూడా ట్వీట్స్ చేశారు. అటు సమంతా నాగచైతన్య తల్లికి ఫోన్ చేసినట్లు తెలిసింది. ఈ విడాకుల ప్రకటన తర్వాత తనతో మాట్లాడి చాలా ఫీల్ అయినట్లు టాక్ నడుస్తోంది. చైతన్యతో విడిపోతున్నందుకు క్షమించాలని కోరినట్లు సమాచారం. నిజానికి తన నుంచి విడిపోవడం ఇష్టం లేకపోయినా.. కొన్ని అనివార్య పరిస్థితుల మూలంగా విడిపోవాల్సి వస్తుందని వెల్లడించిందట. చైతన్య భార్య పొజిషన్ నుంచి విడిపోయినా.. మిత్రులుగా కలిసే ఉంటామని చెప్పింది. అటు జరిగిన దానికి బాధపడ్డం మానేసి.. భవిష్యత్ పై ఫోకస్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *