Breaking News

నటి సుధా కి దారుణ అవమానం.. ఇక పై ఆ పని కి నో..!

ఇండస్ట్రీలో కొన్ని సార్లు ఎవరో చేసిన పనికి మరెవరో ఇబ్బందులు పడుతుంటారు. సెట్ మీద ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక దాదాపు 25 ఏండ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సీనియన్ యాక్ట్రస్ సుధారెడ్డి తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. ఆమె గురించి స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సుధారెడ్డికి హీరోయిన్ గా యాక్ట్ చేసే చాన్స్ రాలేదు. సీనియర్ ఎన్టీఆర్, మోహన్‌బాబు నటించిన మేజర్ చంద్రకాంత్ మూవీలో యాక్ట్ చేసిన ఆమె.. తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలో హీరోకి వదిన క్యారెక్టర్‌లో ఆడియన్స్‌ను మెప్పించింది. ఇక అప్పటి నుంచి సైడ్ క్యారెక్టర్లలో మాత్రమే నటిస్తోంది. హీరో, హీరోయిన్‌కు అక్క, అమ్మ, వదిన తదితర పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ ట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికర, సంచనల విషయాలు షేర్ చేసుకున్నారు. అది కూడా ఓ డైరెక్టర్‌తో జరిగిన ఘటన గురించి.. 7/జి బృందావన కాలనీ అప్పట్లో మంచి హిట్ అందుకుంది. చాలా మందిని అట్రాక్ట్ చేసింది. కానీ ఆ సినిమాలోని హీరో, హీరోయిన్ ఈ సినిమా తర్వాత చాలా తక్కువ మూవీస్‌కే పరిమితమయ్యారు.

అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ సెల్వరాఘవన్ తన మాటలతో సుధారెడ్డిని చాలా ఇబ్బందులకు గురిచేశాడట. దీంతో సుధారెడ్డి కన్నీరు పెట్టుకుంటూ సెట్ నుంచి వెళ్లిపోయిందట. ఇక డైరెక్టర్ చేసిన పనికి ఆమె షూటింగ్ కు రానని పట్టుబట్టడంతో అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ బతిమిలాడటంతో చివరి వరకు ఆ మూవీలో యాక్ట్ చేసిందట. ఇక తర్వాత ఆ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌కు సంబంధించిన ఏ మూవీలోనూ యాక్ట్ చేయకూడదని డిసైడ్ అయినట్టు చెప్పింది. ఇండ‌స్ట్రీలో చిన్న, పెద్ద అనే వేరియేషన్ ఉండకూదడని, అందరితో కలిసి మంచి ఎన్విరాన్‌మెంట్‌ ఉంటేనే వర్క్ చేయొచ్చని చెప్పుకొచ్చింది సుధారెడ్డి. ఆ షూటింగ్ టైంలో డైరెక్టర్ సెల్వా రాఘవన్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పింది. రెమ్యురనేషన్ కోసం మూవీస్‌లో యాక్ట్ చేయనని, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌తో రిలేషన్ కూడా ఇంపార్టెంటేనని చెప్పింది సుధారెడ్డి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *