Breaking News

దు:ఖం ఆపులేకపోతున్న అక్కినేని అమల.. కన్నీరు కార్చని రోజు లేదు .!

అక్కినేని కుటుంబానికి గత కొంతకాలంగా కలిసి రావడం లేదట. ఏది తలపెట్టినా వారి కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతోందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని తెలిసింది. ఇటీవల నాగార్జున తీసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతుండటంతో పాటు అక్కినేని నట వారసుడు అఖిల్ నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఏదీ హిట్ కాకపోవడం వారిని తెగబాధిస్తుందట.. దీంతో తమ పరువు క్రమంగా పోతోందని కుటుంబసభ్యులు అనుకుంటున్నారని సన్నిహితుల ద్వారా తెలిసింది.

ఇకపోతే, అక్కినేని కుటుంబానికి చెందిన వారసులకు ఒకేసారి వివాహం జరిపించాలని నాగ్, అమల భావించారట. సామ్ చై లవ్ మ్యాటర్ గురించి ముందే తెలియడం, అఖిల్ శ్రీయా భూపాల్ రెడ్డి ఎంగేజ్ మెంట్ అయ్యాక.. ముందు
అఖిల్ మ్యారేజ్ ఇటలీలో గ్రాండ్‌గా చేయాలని కుటుంబం భావించింది. కానీ, అనుకోకుండా ఏదో మనస్పర్దల కారణంగా ఎంగేజ్‌మెంట్‌తోనే అఖిల్ శ్రీయా భూపాల్ రెడ్డి పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత సామ్ చై ప్రేమవివాహం గ్రాండ్‌గా జరిపించినా.. నాలుగేళ్లకే ఆ వివాహ బంధం విడాకులకు దారితీయడంతో అంతా తీరని దు:ఖంలో మునిగిపోయారని తెలిసింది. ఓవైపు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పాటు కుటుంబంలో కలహాలు చోటుచేసుకోవడంతో అమల నాగ్ బాధపడని రోజంటూ లేదట.

అఖిల్ వివాహం ఆగిపోయినా.. సామ్ చై వివాహం జరిగాక అక్కినేని కుటుంబంలో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. ఆ తర్వాత నాలుగేళ్ల వరకు ఈ టాలీవుడ్ క్యూట్ కపుల్ ఎంతో అన్యోన్యంగా గడిపారు. ఒక్కసారిగా ఏమైందో తెలీదు. సామ్ బాలీవుడ్ ప్రాజెక్టులు చేయడంతో పాటు కుటుంబాన్ని విస్మరించిదని గాసిప్స్ వచ్చాయి. ఆ తర్వాత సామ్ తన సోషల్ మీడియా ఐడీలో పేరు మార్చడంతో సామ్ చై దంపతులు విడాకులు తీసుకుంటారని వార్తలు షికార్లు చేయడంతో అక్కినేని కుటుంబంలో మనశ్శాంతి కరువైందట. సన్నిహితులు నాగ్ ఫ్యామిలీకి కాల్ చేసి వారిద్దరి మధ్య ఏం జరుగుతోందని అడుగని రోజంటూ లేదని తెలిసింది. దీంతో కుటుంబం మొత్తం డిస్టప్ అయ్యిందట. సామ్ చై మధ్య మనస్పర్దలు ఎందుకు వచ్చాయని బయటకు తెలియక పోయినా.. చివరకు వీరిద్దరూ విడిపోవడంతో కుటుంబసభ్యులు, అభిమానులు తెగ బాధపడ్డారని తెలిసింది. అమల మాత్రం తన కుమారులు ఇద్దరి జీవితాలు ఇలా ఎందుకు అయ్యాయో తెలీక కన్నీరు పెట్టుకోని రోజంటూ లేదట.. ప్రతీరోజు గుర్తుచేసుకుని బాధపడుతుంటే నాగ్ ఓదార్చేవారని తెలిసింది. ఏదేమైనా మనసులో అంత బాధపెట్టుకుని ఎవరైనా ఇంటికి వస్తే నవ్వుతూ పలకించడం వారికి పరిపాటిగా మారిపోయిందని సన్నిహితులు అనుకుంటున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *