Breaking News

దివ్యభారతి పోలికలు ఉన్న ఈ హీరోయిన్.. ఇన్ని రోజులు ఏమైపోయింది? పెద్ద మిస్టరీ

దివ్య భారతి.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. చిన్న ఏజ్‌లోనే దేశ వ్యాప్తంగా చాలా పాపులర్ హీరోయిన్ అయింది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా మూవీస్ చేస్తూ బ్లక్ బస్టర్ హిట్స్ అందుకుంది. చాలా చన్ని ఏజ్‌లోనే ఆమెకు స్టార్‌డమ్ రావడం ఆ టైంలో ఓ సంచలనమనే చెప్పాలి. 18 సంవత్సరాల వయసులోనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ న‌డియ‌డ్‌వాలాను లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె మృతి ఇప్పట‌కీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. దివ్య యాక్ట్ చేసింది తక్కువ మూవీసే అయినా ఆమె ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఆమెకు ఇప్పటికీ సంచనాలకు మారుపేరుగా ఉన్న హీరోయిన్‌గానే పేరుంది. ఆమె చనిపోయాక సేమ్ దివ్యభారతి పోలికలే ఉన్నట్టుగా ఆమెను మైమరపించేసింది మరో హీరోయిన్. ఆమె ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? ఆమె ఎవరో కాదు మమతా కులకర్ణి.

మమతకు కాస్త దివ్యభార‌తి పోలికలు ఉండ‌డంతో ఆమె సైతం ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఆమె సైతం బాలీవుడ్, టాలీవుడ్ మూవీస్‌లో యాక్ట్ చేసి మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది. ఆ కాలంలోనే టాప్‌లెస్ ఫొటోలకు ఫోజులచ్చి కాంట్రవర్సీని క్రియేట్ చేసింది మమత. ప్రేమ శిఖ‌రం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన మమత అనంతరం.. దొంగా పోలీస్ వంటి మూవీస్‌లో యాక్ట్ చేసింది. మంచి ఫామ్‌లో కొనసాగుతుండగానే ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అది ఎవరికీ అంతుచిక్కలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె తన ఫొటోస్‌ను పోస్ట్ చేసి తిరిగి వార్తల్లోకి ఎక్కింది. ఇన్ని రోజులు ఆమె ఎమైపోయింది? ఎక్కడ ఉంది అనే విషయాలు ఆసక్తికరంగానే మిగిలాయి. న్యూయార్క్‌కు చెందిన ఓ ఎన్నారైను మ్యారేజ్ చేసుకుని అక్కడే సెటిలైంది. తర్వాత అతడితో విడిపోయి వీక్కీ గోస్వామిని మ్యారేజ్ చేసుకుంది. కొన్నేండ్ల పాటు కెన్యాలో సెటిలైంది. వీక్కీ ఓ డ్రగ్స్ వ్యాపారి. అత‌డిని మ్యారేజ్ చేసుకోవడంతోనే మమత లైఫ్ చీకటైంది. విక్కీ అనేక కేసుల్లో నిందితుడిగా ఉండటంతో మమత సైతం అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *