Breaking News

దిల్ హీరోయిన్ సినిమాలు వదిలేసి చివరికి అమెరికాలో ఆ పని చేస్తుందా ?

దిల్ సినిమా.. 2003లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. నితిన్‌కి ఇది రెండో సినిమా. మొదటి సినిమా జయంతో పోలిస్తే ఈ సినిమా అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ సినిమాతోనే నితిన్ మాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. నితిన్ సినీ కెరియర్‌లో ఇది ఫస్ట్ కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. దిల్ రాజు నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది. దిల్ మూవీని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేశారు. ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లో లవ్ స్టోరీ మూవీస్ కు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ ఓ బ్రాండ్ అనే చెప్పాలి. నేహా ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆమెకు ఇది మొదటి సినిమానే అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ‘అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్’ అని వేణుమాదవ్ చెప్పిన డైలాగ్ నేటికీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఈ సినిమా అనంతరం జగపతి బాబు హీరోగా నటించిన ‘అతడే ఒక సైన్యం’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత దోస్త్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి రవితేజ నటించిన దుబాయ్ శీను మూవీలో జేడీ చక్రవర్తి భార్యగా ఓ ఇంపార్టెంట్ రోల్‌ చేశారు. జేడీ చక్రవర్తి, నేహా క్యారెక్టర్స్ చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుండటం విశేషం. అనంతరం బొమ్మరిల్లు మూవీలోనూ ఓ ముఖ్య పాత్రలో నటించారు.

బొమ్మరిల్లు అనంతరం ఈ అమ్మడు.. ఎక్కువగా కనిపించలేదు. ప్రస్తుతం రిషిరాజ్ జవేరిని పెండ్లి చేసుకుంది. వారికి ఓ అమ్మాయి సైతం ఉంది. సోషల్‌మీడియాలో సైతం ఎక్కువగా యాక్టివ్ ఉండదు ఈ భామ. నేహా మూవీస్ లోనే కాకుండా కొన్ని హిందీ సీరియల్స్‌లో సైతం నటించింది. ప్రస్తుతం సినిమాలకు, సీరియల్స్‌కు దూరంగా ఉంటున్న ఈ భామ.. ఫ్యామిలీతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నది. నేహా మళ్లీ తిరిగి మంచి పాత్రల్లో నటిస్తూ తమ ముందుకు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *