Breaking News

దారుణం.. హీరోయిన్ సాక్షిశివానంద్‌ను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయేలా చేసిన ఆ హీరో ఫ్యామిలీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమ కెరీర్‌ను సెట్ చేసుకుని బాగా డబ్బులు సంపాదించుకున్నాక, ఇక అవకాశాలు మొత్తానికి రావడం లేదని తెలిసాక పెళ్లిచేసుకుని సెట్ అవుతుంటారు. లేదా తమ సొంతూరుకు వెళ్లిపోతారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి దశలో ఉండగానే తిరిగి తన ఊరికి వెళ్లిపోయింది. మళ్లీ ఎన్నడూ తెలుగు తెరపై కనిపించలేదు. ఆమె ఎవరనుకుంటున్నారా..? హీరోయిన్ సాక్షిశివానంద్..


తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలే. మెగాస్టార్ చిరంజీవితో ‘మాస్టర్’మూవీలో ఈ అమ్మడు కనిపించింది. తొలిసినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత మహేశ్ బాబుతో కూడా ఓ సినిమా చేసింది. అయితే, ఓ హీరో ఫ్యామిలీ వలన సాక్షి శివానంద్ తెలుగు చిత్ర పరిశ్రమను వదిలేసి ముంబైకు వెళ్లిపోయినట్టు తెలిసింది.

సాక్షి శివానంద్ కెరీర్ టాలీవుడ్‌లో బాగున్న సమయంలో తన సోదరి శిల్పా శివానంద్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంది. అదే సమయంలో ఒక స్టార్ హీరో తన కొడుకును హీరోగా లాంచ్ చేయాలనుకున్నాడు. ఆ మూవీలో శిల్పా శివానంద్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే, మూవీ చిత్రీకరణ సమయంలో శిల్పా శివానంద్ అనారోగ్యం బారిన పడింది. దీంతో షూటింగ్‌కు రాలేక పోయింది.

ఇదే విషయాన్ని సాక్షి శివానందర్ మూవీ యూనిట్‌కు వివరించింది. కానీ ఆ హీరో తండ్రి మాత్రం తను తప్పనిసరిగా షూటింగ్ కు హాజరుకావాలని పట్టుబట్టాడు. అంతటితో ఆగకుండా సాక్షి శివానంద్ చెల్లెలపై ఆ హీరో తండ్రి చేయి చేసుకున్నాడట.. ఈ ఒక్క ఘటన సాక్షి శివానంద్‌కు విపరీతంగా కోపం తెప్పించింది. దీంతో సాక్షి శివానంద్ హీరో తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను మాత్రం తనకున్న పలుకుబడితో బయటకు వచ్చాడు. తన చెల్లెలిపై హీరో తండ్రి చేయి చేసుకోవడాన్ని భరించలేకపోయిన హీరోయిన్ సాక్షిశివానంద్ వెంటనే సొంతూరు ముంబై వెళ్లిపోయారట..అలా ఆరోజు వెళ్లిందంటే మళ్లీ ఇంతవరకు టాలీవుడ్ ఇండస్ట్రీ ముఖం కూడా చూడలేదని తెలిసింది. కెరీర్ మంచి రైజింగ్ టైంలో ఉన్నప్పుడు సాక్షిశివానంద్ వెళ్లిపోవడం ఎవరికీ నచ్చలేదట.. కానీ, ఆ హీరో ఫ్యామిలీ ఎవరనేది ఇంతవరకు రహస్యంగానే మిగిలింది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *