Breaking News

దారుణంగా మోసపోయిన నటి పవిత్ర లోకేష్..!

చిత్ర పరిశ్రమలో సినీ సెలబ్రెటీలు నమ్మి మోసం పోవడం అనేది సాధారణమైన విషయమే. అయితే ఈ మధ్యనే టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు ఎవరినో నమ్మి లక్ష రూపాయలు ఇచ్చారు. ఇక కరోనా వ్యాక్సిన్లు ఇస్తానని మోసం చేశారు. ఇక ఇప్పుడు అదే కోవలో మరో టాలీవుడ్ ప్రముఖ నటి కూడా మోసపోయిన సంగతి వెలుగులోకి వచ్చింది. కాగా.. ఆ నటి ఎవరో ఒక్కసారి చూద్దామా.

ఇక తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో తల్లి పాత్రల్లో ఒదిగిపోయే సీనియర్ నటి పవిత్ర లోకేష్. అయితే అందం, చందం, పద్ధతిగా ఉండే ఈమె ఇటీవల దారుణంగా మోసపోయినట్లు చెప్పుకొచ్చింది. కాగా.. ఆమె సన్నిహితుడే ఆమెకు షాక్ ఇచ్చినట్టు తెలిపారు. అంతేకాదు.. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పవిత్ర లోకేష్ బిజీగా సినిమాల్లో నటిస్తూ బిజీగా రాణిస్తున్నారు. అంతేకాక.. ఆమెను నమ్మించి ఆమె మేనేజర్ నట్టేట ముంచినట్టుగా తెలిపారు. అయితే ఆమె మేనేజర్ ఆర్థిక లావాదేవీల్లో మోసం చేసినట్లు తెలుస్తుంది.

అయితే దాదాపు 60 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లింపులు చేయలేదని.. దీంతో ప్రభుత్వం నుంచి పవిత్రా లోకేష్ కు నోటీసులు అందాయని బీటౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతుంది. ఇక గతంలో సినీ సెలబ్రెటీలు ఎందరో ఇటువంటి మోసాలకు గురైయ్యారు. సినీ జీవితంలో బిజీగా ఉండి ఆర్థిక లావాదేవీలను మేనేజన్లను నమ్మి అప్పగించి కోట్లు కోల్పోయిన సెలబ్రెటీల ఉదంతాలెన్నో జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు పవిత్ర లోకేష్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

కాగా.. ఆ మధ్య అనసూయ కూడా జీఎస్టీ పన్నులు, ఆదాయా వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకునేవాడని.. కానీ తనకు నోటీసులు వచ్చాక మోసపోయానని తెలిసి వాటిని కట్టేశానని పేర్కొన్నారు. ఇక ఇలా ఎందరో సెలబ్రెటీలు కొందరు మేనేజర్లు చేసిన మోసాలకు అప్పులపాలైన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. అంతేకాక.. ఇప్పు పవిత్ర లోకేష్ కూడా అలానే మోసపోయినట్లు తెలిపారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *