Breaking News

దర్శక దిగ్గజం ‘రాఘవేంద్ర రావు’కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శక దిగ్గజం కోవెలమూడి రాఘవేంద్రరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలనాటి దిగ్గజ నటులు ఎన్టీయార్ నుంచి మొన్నటి చిరు, నాగ్‌లతో సహా కుర్ర హీరోలతోనూ కలుపుకుని కొన్ని వందల సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల్లో వైవిధ్యమైన కథలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్లను, హీరోలను వెండితెరపై ప్రజెంట్ చేయడంలోనూ ఆయనది ప్రత్యేకశైలి. భక్తి చిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే పోటీ అని చెప్పవచ్చు. రాఘవేంద్రరావు టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నా ఆయన కొడుకు కోవెలమూడి ప్రకాశ్ మాత్రం ఎందుకో వెనుకబడిపోయారు.

తొలుత నటుగా పరిచమైనా ఆ తర్వాత దర్శకుడిగా మారి 2004లో‘బొమ్మలాట’అనే బాలల చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి 2005లో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును కైవసం చేసుకుంది. కానీ, కమర్షియల్‌ విజయాన్ని అందుకోలేక పోయింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ‘శ్రుతి హాసన్‌’ను పరిచయం చేస్తూ సిద్ధార్థ్ హీరోగా ‘అనగనగా ఓ ధీరుడు’సినిమా తీయగా అదికాస్త బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కానీ ‘లక్ష్మీప్రసన్న’కు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు దక్కింది. ఇక 2017లో అనుష్క హీరోయిన్‌గా ‘సైజ్ జీరో’తీసి నవ్వుల పాలయ్యాడు ప్రకాశ్.. ఈ సినిమా కోసం అనుష్క తనను తాను పూర్తిగా మార్చుకుని అధిక బరువు పెరిగింది.

తెలుగులో కలిసి రావడం లేదనుకున్నాడేమో తెలీదు కానీ బాలీవుడ్‌లో అడుగుపెట్టి హీరోయిన్‌గా‘కంగ‌నా ర‌నౌత్’,రాజ్‌కుమార్ రావు హీరోగా ‘జ‌డ్జిమెంట‌ల్ హై క్యా’ మూవీని తెరకెక్కించాడు. 2019లో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరవాలేదని పించినా కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది. అయితే, ఈ మూవీకి ప్రకాశ్ మాజీ భార్య కనిక స్క్రీన్ ప్లే అందించారు. 2014లో ప్ర‌కాశ్‌, కనికకు మ్యారేజీ అవ్వగా.. మూడేళ్ల త‌ర్వాత మనస్పర్దల రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక కనిక రైట‌ర్‌ హిమాంశు శ‌ర్మను రెండో పెళ్లి చేసుకోగా.. ప్రకాశ్ మాత్రం ఒంటరిగానే ఉన్నాడు. తండ్రి అంత పెద్ద సక్సెస్ ఫుల్ దర్శకుడైనా కొడుకు జీవితం మాత్రం ఇలా ఎక్కడ కాకుండా పోవడంతో రాఘవేంద్రరావు అప్పుడప్పుడు బాధపడుతుంటారట..

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *