Breaking News

త్వరలో సుధీర్ మ్యారేజ్.. అమ్మాయి వివరాలివే..!

బుల్లితెరపై ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో నటించి బాగా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్‌లో ఒకరు సుడిగాలి సుధీర్. తెలుగు ప్రేక్షకులు సుధీర్‌ను కమెడియన్‌గా బుల్లితెరతో పాటు వెండితెరపైన ఆదరించారు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’సినిమాతో సుధీర్ టాలీవుడ్‌లోకి హీరీగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కమెడియన్ రోల్స్ కూడా ప్లే చేస్తున్నాడు సుధీర్.

ఇకపోతే ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్- యాంకర్ రష్మి గౌతమ్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మి-సుధీర్ ఒకరి కోసం మరొకరు పుట్టారు అన్నంత రేంజ్‌లో ప్రతీ ఎపిసోడ్‌లో వారి మాటలు ఉంటాయి. ఇక ఒకరినొకరు తిట్టుకోవడం, అంతలోనే కలిసిపోవడం, మళ్లీ పొట్లాడుకోవడం చూస్తుంటే నిజంగానే వారు ప్రేమ పక్షులను ప్రతీ ఒక్కరు అనుకుంటారు. కానీ, అది కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసమే అన్న విషయం తాజాగా ప్రూవ్ అయింది. సుధీర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. తన ఫ్యామిలికీ తెలిసిన వారి ద్వారా సుధీర్ మ్యారేజ్ సెట్ అయిందని సమాచారం. విజయవాడకు చెందిన సుధీర్.. కృష్ణా జిల్లాకు చెందిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు వినికిడి. ఈ వార్త తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ స్క్రీన్‌పైన ఇన్ని రోజులు రష్మితో జరిపిన ప్రేమాయణం ఉట్టుట్టిదేనా అని అనుకుంటున్నారు. అయితే, చాలా సందర్భాల్లో రష్మికి, తనకు మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమేనని, ఇంకా వేరే ఏ రిలేషన్ షిప్ లేదని సుధీర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో మాత్రం సుధీర్- రష్మిల మ్యారేజ్, రొమాన్స్‌కు సంబంధించిన బోలెడు వార్తలు వైరల్ అవడమే కాదు. చాలా డిస్కషన్ కూడా జరిగింది. ఇకపోతే తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన కృష్ణా డిస్ట్రిక్ట్ అమ్మాయితో మ్యారేజ్‌కు సుధీర్ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్సెస్ ఉన్నాయి. సుధీర్ వెండితెరపైన పలు చిత్రాల్లో నటించాడు. ఇటీవల విడుదలయిన అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫిల్మ్‌లో అఖిల్ ప్రెండ్‌గా సుధీర్ కనిపించాడు. ఈ సినిమాలో సుధీర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *