Breaking News

త్రిష చేసిన పనికి ఆగ్రహంతో ఊగిపోయిన డైరెక్టర్.. చెంప చెల్లుమనిపించాడట!

త్రిష.. ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితమే. తెలుగు చిత్ర పరిశ్రమలో పోటాపోటీగా సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో అప్పటివరకు టాప్ లో ఉన్న హీరోయిన్స్ అందరినీ తన అందం, అభినయంతో పక్కకు నెట్టేసింది. ప్రస్తుతం త్రిష సౌత్ ఇండియాలోనే సెటిల్ అయ్యింది. తెలుగు పరిశ్రమకు దూరమైన తమిళ్‌లో మాత్రం మంచి సినిమాలు చేస్తోంది. కమర్షియల్, లేడి ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా ఈ ఏజ్ లోనూ తానెంటో ప్రూవ్ చేసుకుంటోంది. ప్రస్తుతం మూడు పదుల వయస్సులోనూ నయన్ తర్వాత.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా త్రిష కొనసాగుతోంది. అయితే, ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా త్రిష చేసిన పనికి ఆ డైరెక్టర్ ఆగ్రహంతో ఊగిపోయాడట. చెడామడా తిడుతూ ఆమెపై చేయి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

త్రిష యాక్ట్ చేస్తున్న ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా ట్రెడిషనల్ లుక్‌లో సంప్రదాయ వస్త్రాలు ధరించి పూజ చేయాల్సిన సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఆ టైంలో త్రిష సంప్రదాయ దుస్తుల్లో రాకుండా ఎక్స్పోజింగ్ చేసే వస్త్రాలు ధరించి లొకేషన్‌కు వచ్చింది. అలా మోడరన్ డ్రెస్‌లో చూసిన డెరెక్టర్ త్రిషపై ఆగ్రహంతో రగిలిపోయాడు. నీకు అసలు బుద్ధుందా.. ఎప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలీదా అంటూ చెడామడా తిట్టేశాడు. అంతటితో ఆగకుండా చేయి చేసుకున్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే, సెట్లో డైరెక్టర్ తనను తిట్టడం, చేయి చేసుకోవడం అవమానకరంగా భావించిన త్రిష ఆ మూవీ నుంచి తప్పుకున్నట్టు తెలిసింది.

ఇదిలాఉండగా, త్రిషకు ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గినా తమిళ్ చిత్ర పరిశ్రమలో మాత్రం ఈ అమ్మడు వరుసపెట్టి అవకాశాలు దక్కించుకుంటోంది. చాలా మంది సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గినా.. ఈమెకు మాత్రం కొత్త అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. ఇకపోతే త్రిష త్వరలో ప్రేమ పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో కథనాలు రావడంపై ఆమె స్పందించింది. తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని, పెళ్లి కూడా చేసుకోవడం లేదని ఘాటుగా స్పందించింది. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మీకు తెలియజేస్తానని కుండబద్దలు కొట్టింది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *