Breaking News

తాగొచ్చి రచ్చ చేస్తున్న ఎమ్మెస్ ని చెంప పగలగొట్టిన డైరెక్టర్ ఎవరు?

తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు ఎమ్మెస్ నారాయణ. ఈయన తన కామెడీతో దశాబ్దానికి పైగా తెలుగు జనాలను కడుపుబ్బా నవ్వించాడు. చూడ్డానికి పొట్టిగా ఉన్నా.. ఆయన వేసే పంచులు ఓ రేంజిలో ఉండేవి. తన అద్భుతమైన టైమింగ్ తో పటాసుల్లా పేలే పంచులు విసిరేవాడు. అదే తనకు ప్లస్ పాయింట్ గా మారింది. ఎన్నో అద్భుత సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేసింది. నటుడిగా ఎంతో పేరున్న ఎమ్మెస్ నారాయణను దర్శకుడు సాగర్ లాగిపెట్టి కొట్టాడట. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెస్ నారాయణే చెప్పడం విశేషం. ఇంతకీ ఎమ్మెస్ ను కొట్టాల్సిన అవసరం దర్శకుడికి ఎందుకు వచ్చింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

టాలీవుడ్ లో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు సాగర్. అన్వేషణ ,చార్మినార్ సహా పలు సినిమాలు చేసి అందరి చేత వారెవ్వా అనిపించుకున్నాడు. అంతేకాదు.. మంచి కంటెంట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పాడు. ఓ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు కోటా శ్రీనివాసరావుతో సాగర్ కు వివాదం జరిగింది. దానికి కారణం ఏంటంటే.. సినిమా షూటింగ్ లో ఓ సీన్ షూట్ చేయాల్సి ఉంది. అప్పుడు భరణి, మహేష్ ఆనంద్, కోటా శ్రీనివాసరావుపై ఈ సీన్ చిత్రీకరించాలి. ఇచ్చిన డేట్ ప్రకారమే వీరంతా సెట్ లో ఉండాలి.

కానీ కోటా షూటింగ్ కు రాలేదు. తన దగ్గరి బంధువు ఒకరు చనిపోయాడు. దీంతో తను రాలేనని.. షూటింగ్ వాయిదా వేయాలని కోరాడు. అయితే కోటాకు వీలున్న సమయాన్ని చూసుకుని డేట్ ఫిక్స్ చేశారు. మళ్లీ అనుకున్న డేట్ రోజు రాలేనని కోటా చెప్పాడు. వెంటనే దర్శకుడు బాగా కోప్పడ్డాడు. తనతో గేమ్స్ ఆడొద్దని చెప్పాడు. వచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకొని వెళ్లాలని చెప్పడంతో.. షూటింగ్ లో పాల్గొన్నాడట కోటా. అదే సమయంలో ఎమ్మెస్ నారాయణ బాగా తాగి వచ్చి నిర్మాతలను బూతులు తిట్టాడట. ఆ కోపంలో ఎమ్మెస్ చెంప పగలగొట్టినట్టు సాగర్ వెల్లడించాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *