Breaking News

తప్పు మీద తప్పులు చేసిన చిరంజీవి కూతురు శ్రీజ

 చిరంజీవి ఓ వ్యక్తి కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక శక్తి.. సాధారణ వ్యక్తి నుంచి మెగాస్టార్‌గా ఎదిగేందుకు ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ తర్వాత వారి వారసులకే అంత కీర్తి లభిస్తుందనుకునే వారికి.. స్వయంకృషి ఉంటే ఏదైనా సాధించొచ్చు అని కొణిదెల చిరంజీవి చేసి చూపించాడు. ఎన్టీఆర్ తర్వాత అంతటి రేంజ్‌లో అభిమానులను సొంతం చేసుకున్నారు. నానాటికీ ఆయన క్రేజ్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఇప్పటికీ తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనే హవానే కొనసాగుతుందటే అతిశయోక్తి కాదు. అలాంటి చిరు జీవితం తెరిచి ఉంచిన పుస్తకం.. తన సినీ జీవితంలో చిన్న మచ్చ కూడా అంటలేదు. అటు రాజకీయాల్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా మరల లేచి ధృడ సంకల్పంతో నిలబడ్డారు.  కానీ, ఆయన మొదటిసారి మానసికంగా కుంగిపోయిన విషయం ఏదైనా ఉందంటే.. అది ఆయన ముద్దుల చిన్న కూతురు శ్రీజ చేసిన పని వల్లే అని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. 

శ్రీజ అంటే చిరుకు ప్రాణమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అలాంటిది సొసైటీలో గౌరవప్రదంగా ఉన్న తండ్రికి ఒక్క మాట కూడా చెప్పకుండా.. ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్ళి చేసుకోవడంతో చిరు ఎంతో మానసిక వేదన అనుభవించారు. తెలిసి తెలియని వయసులో ఆమె చేసిన తప్పులకు చిరంజీవి శిక్ష అనుభవించారు. ఆ తప్పులను ఇటీవల సరిదిద్దుకుని, మరల తండ్రి మమకారం వలన ఇప్పుడు సరికొత్త జీవితాన్ని గడుపుతోంది. పేరెంట్స్ మాట వినకుండా శ్రీజ చేసిన అతిపెద్ద మిస్టేక్స్ ఎంటో తెలుసా ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకోవడమే.

చిరు చిన్నకూతురు శ్రీజ చదువుకునే రోజుల్లో భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలిసేసరికి ఎవరికీ చెప్పకుండా.. తన తండ్రి పరువు పోతుందని కూడా ఆలోచించకుండా ఆర్యసమాజ్ లో పెళ్లిచేసుకుంది. అప్పుడే తండ్రి గౌరవ మర్యాదల గురించి ఆలోచించి ఉంటే శ్రీజ ఈ తప్పు చేసేది కాదని అందరూ అంటున్నారు. ఒక్క చిరంజీవే కాదు.. తండ్రి స్థానంలో ఉన్న ఎవరైనా గుడ్డిగా ప్రేమ పెళ్లికి అంగీకరించరు. అయితే, మీడియా సహకారంతో శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్నాక చిరు కొన్ని రోజులు ఎవరికీ కనిపించలేదని సమాచారం. ఎంతో మానసిక వేదన అనుభవించారు. కానీ శ్రీజ మాత్రం తన బాబాయ్ పవన్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం క్షమించరాని నేరం.

మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నా కొద్ది రోజులు కూడా శ్రీజ అతనితో కలిసి ఉండలేకపోయింది. వారిద్దరికీ పాప పుట్టడంతో నవదంపతుల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. భరద్వాజ్‌తో గొడవలు, అత్తింటి వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీజ తిరిగి తండ్రి వద్దకు చేరుకుంది. ఇంత జరిగాక కానీ ఆమెకు తండ్రి విలువ ఎంటో అర్థం కాలేదు. ఏదేమైనా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నాక.. చిరు మళ్లీ మంచి సంబంధం చూసి మళ్లీ గ్రాండ్‌గా శ్రీజకు వివాహం జరిపించి కొత్త జీవితం ప్రసాదించారు. దీంతో శ్రీజకు తండ్రి అంటే ఎంటో, ఆయన బాధ్యతలు అంటే ఏమిటో అప్పుడు తెలిసి వచ్చిందని ఆమె సన్నిహితులు తెలిపారు. మొత్తానికి చిరు తన ఫ్యామిలీని ఎంతగా ప్రేమిస్తాడో, అభిమానులను కూడా అంతే ప్రేమిస్తాడని సినీవర్గాల టాక్.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *